Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Urea Fertilizer Sale | ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
దౌల్తాబాద్ లోని జ్యోతి ఫర్టిలైజర్ దుకాణంలో వ్యాపారి గోపిశెట్టి శ్రీనివాస్ యూరియా బస్తాలతో పాటు నానో డీఏపీ కొనాలని షరతు విధించాడని రైతు చాకలి వెంకటయ్య ఆరోపించారు.
యూరియా కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉన్నా బస్తాలు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తూ, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Urea Fertilizer Sale | దౌల్తాబాద్, నవంబర్ 17: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు విక్రయించాల్సిన వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా బస్తాలు కావాలంటే అదనంగా నానో డీఏపీ కొనుగోలు చేయాల్సిందేనని షరతు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జ్యోతి ఫర్టిలైజర్ దుకాణంలో ఈ తరహా విక్రయాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన రైతు చాకలి వెంకటయ్య ఆదివారం ఆన్లైన్లో 24 బస్తాల యూరియా బుక్ చేసుకున్నాడు. సోమవారం దుకాణానికి వస్తే మంగళవారం యూరియా ఇస్తామని చెప్పడంతో ఆయన తిరిగి వెళ్లాడు. మంగళవారం ఉదయం 10 గంటలకు యూరియా కోసం దుకాణానికి చేరుకున్న రైతు సాయంత్రం 4 గంటల వరకు నిరీక్షించినా బస్తాలు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)