Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వండేది చూడొచ్చు!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The article introduces the 'Ninja Crispy Glass Air Fryer', a new kitchen appliance featuring transparent borosilicate glass bowls that allow users to monitor cooking without opening the basket.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఎయిర్ ఫ్రైయర్లో వంట చేస్తున్నప్పుడు ఆహారం ఎంతవరకు ఉడికిందో చూడాలంటే బుట్టను బయటికి తీయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వంట జరుగుతున్న తీరును బయట నుంచే గమనించే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. అదే ‘నింజా క్రిస్పి గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్’. సాధారణ ఎయిర్ ఫ్రైయర్లో ఉండే అపారదర్శక బుట్టకు బదులుగా ఇందులో పారదర్శకమైన బోరోసిలికేట్ గాజు పాత్రలు ఉంటాయి. అందులో ఆహారం రంగు మారుతున్న తీరును, పైభాగం కరకరలాడేలా తయారవుతున్న విధానాన్ని గమనించవచ్చు. 1,700 వాట్ల శక్తితో పనిచేసే ఈ పరికరం వేడి గాలిని అన్ని వైపులా ప్రసరింపజేసి ఆహారాన్ని ఉడికిస్తుంది.
1.4 లీటర్లు, 3.8 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు పాత్రలు ఉండటంతో ఒక్కరి కోసం చిన్న పరిమాణంలోనూ, కుటుంబానికి సరిపడా పెద్ద మొత్తంలోనూ ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఈ పరికరంలో ఆహారాన్ని వేయించడం, కాల్చడం, వెచ్చగా ఉంచడం వంటి పనులతో పాటు ముందుగా వండిన పదార్థాలను మళ్లీ కరకరలాడేలా చేసే ప్రత్యేక విధానం ఉంది. ఉదాహరణకు, మిగిలిపోయిన సమోసాలు, పకోడీలు, పిజ్జాలను మళ్లీ వేడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వంట చేసిన గాజు పాత్రలోనే ఆహారాన్ని వడ్డించవచ్చు, చల్లారిన తర్వాత మూతపెట్టి నిల్వ చేయవచ్చు కూడా. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)