Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విద్యుత్ ఉద్యోగుల సమ్మె: కరెంట్, నీళ్లు లేక అల్లాడిపోతున్న గురుగ్రామ్ ప్రజలు.. ఫ్యాక్టరీలు బంద్
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Electricity department employees in Gurugram, Haryana, went on a 3-day strike protesting the grant of a parallel power distribution license to a private company.
The strike left millions of residents and thousands of industrial units without power and water, causing severe hardship.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హర్యానాలోని గురుగ్రామ్‌లో విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపట్టిన 3 రోజుల సమ్మె నగరాన్ని అతలాకుతలం చేసింది. ప్రైవేట్ సంస్థ 'ఎలెవన్ పవర్'కు సమాంతర విద్యుత్ పంపిణీ లైసెన్స్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ మొదలైన ఈ ఆందోళనతో లక్షలాది కుటుంబాలు, వేలాది పరిశ్రమలు అంధకారంలోకి నెట్టింది. కరెంట్ లేక ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు మూలనపడగా, నీటి సదుపాయం కూడా నిలిచిపోయి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.
గుక్కెడు నీళ్ల కోసం కష్టాలు.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ఇళ్లలో నీటి మోటర్లు పనిచేయక తాగునీటికి కూడా కొరత ఏర్పడింది. సెక్టార్ 9ఏ, హరినగర్, పాలామ్ విహార్, సుశాంత్ లోక్ వంటి ప్రాంతాల్లో 16 గంటలకు పైగా కరెంట్ లేకపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్వర్టర్లు పనిచేయక, మొబైల్ టార్చ్ లైట్ల వెలుతురులోనే ఇళ్లలో వంటలు చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. చిన్న పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో విసుగు చెందిన జనం రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)