Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
విజయవాడ నగర మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన వంగవీటి రాధాకృష్ణ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
విజయవాడ నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ఈ ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో పారిశుద్ధ్యం మరియు ప్రజారోగ్య సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ప్రత్యేక డ్రైవ్‌కు సంబంధించిన తొలి ఫైలుపై ఆయన సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న తదితర నేతలు హాజరయ్యారు, మరియు రాధాకృష్ణ ప్రజలపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 23 days across 2 events →
శానిటేషన్ మరియు ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకంఅధికారులతో సమీక్షా సమావేశం తర్వాత పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామన్న మేయర్విజయవాడ నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ఈ ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కార్యాలయంలోని తన ఛాంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఆసీనులయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ప్రత్యేక డ్రైవ్‌కు సంబంధించిన తొలి ఫైలుపై రాధాకృష్ణ సంతకం చేశారు.
ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, వన్ టౌన్ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విజయవాడ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న, కార్పొరేటర్లందరి సమక్షంలో తాను పదవీ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే తమ పనితీరు ఉంటుందని, ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ నగర సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వర రావు, సుజనా…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)