Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తిరువనంతపురంలో ఒక కాంగ్రెస్ నేత సుహైల్ షాజహాన్ ఒక ప్రైవేట్ సంతానలేమి క్లినిక్ యజమానిని బ్లాక్మెయిల్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు, ఆ డబ్బు తీసుకుంటుండగా పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనపై ప్రతిపక్ష నేత పినరయి విజయన్ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్షీణ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సుహైల్ షాజహాన్‌ను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరువనంతపురం: ఎంపీ సహాయకుడైన కాంగ్రెస్ నేత, ఒక హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఆ హాస్పిటల్ యాజమాని ఫిర్యాదుతో ఆ నేతను రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరించింది. (Congress Leader Extorts Rs 10 lakh) కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఈ సంఘటన జరిగింది. తిరువనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సభ్యుడు, కన్నూర్ ఎంపీ కే సుధాకరన్‌కు సన్నిహితుడైన సుహైల్ షాజహాన్ ఒక ప్రైవేట్ సంతానలేమి క్లినిక్ యజమానిని బ్లాక్మెయిల్ చేశాడు. ‘చంగాతికూట్టం’ అనే సోషల్ మీడియా పేజీలో ఆ క్లినిక్‌కు…
కాగా, ఆ క్లినిక్ యజమాని అయిన డాక్టర్, పెట్టా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కాంగ్రెస్ నేతను ట్రాప్ చేసేందుకు పోలీసులు ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. పోలీసుల సూచన మేరకు సుహైల్ షాజహాన్ అడిగిన డబ్బు చెల్లించేందుకు ఆ డాక్టర్ అంగీకరించారు. మంగళవారం ఆ క్లినిక్ చేరుకున్న కాంగ్రెస్ నేత, ఆ డాక్టర్ నుంచి రూ.10 లక్షలు తీసుకుంటుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రాజకీయ అండతో ఆ నేత చేస్తున్న ఇతర కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)