We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Following Diwali, gold and silver rates have crashed significantly across the Telugu states. On November 11, 2026, the price of 24-carat gold dropped by 71 rupees per gram, while pure silver saw a nationwide price drop of 5,000 rupees per kg.
దీపావళి పండుగ ముగిసిన తర్వాతి నుంచి బంగారం రేట్లు అనూహ్యంగా తగ్గుతూ నేలచూపులు చూస్తున్నాయి. ఇదే క్రమంలో వెండి రేట్లు కూడా పడిపోవటం షాపర్లకు మంచి అవకాశంగా మారుతోంది. ముఖ్యంగా రేట్లు తగ్గినప్పుడల్లా కొంటూ ఉండే తెలుగు ఫ్యామిలీలకు ఇదొక సదవకాశం. అయితే మీరు షాపింగ్ చేయటానికి నిర్ణయం తీసుకునే ముందు సమీప నగరంలోని తగ్గిన రిటైల్ రేట్లను పరిశీలించటం మంచిది.
నవంబర్ 11న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 71 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 198గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 015గా కొనసాగుతోంది.
In Medchal, thieves broke into Sri Jagadamba Jewellers on a busy national highway near the police station, stealing gold, silver, and cash worth approximately Rs. 84 lakhs.
మేడ్చల్ : నగల దుకాణంకు దుండగలు కన్నం వేశారు. ఆ కన్నంలో నుంచి లోపలికి ప్రవేశించి, బంగారం, వెండి నగలతో పాటు నగదు అపహరించారు. 24 గంటలు ప్రజలు సంచరించే జాతీయ రహదారి పక్కన, పోలీస్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న దుకాణంలో దుండగలు చోరీకి పాల్పడటం మేడ్చల్‌లో కలం కలం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ పోలీస్టేషన్ పక్కన ఉన్న దుకాణంలో శేషుమాల్ చౌదరి శ్రీ జగదాంబ జువెల్లర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఆయన దీపావళి పూజలు నిర్వహించి, దుకాణం మూసి వెళ్లిపోయాడు. సోమవారం దుకాణంను తెరవలేదు.
మంగళవారం ఉదయం చౌదరి దుకాణం తీసి చూడగా దుకాణం లోపల ఉన్న చెక్క తలుపు విరిగి ఉంది. కంగారుగా లోపలికి వెళ్లి చూడగా వెనుక ఉన్న గోడకు పెద్ద కన్నం వేసి ఉంది. దుండగలు వెనుక వైపు నుంచి దుకాణంకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. దుకాణంలోకి ప్రవేశించిన తర్వాత అడ్డుగా ఉన్న చెక్క తలుపు సగం వరకు తొలగించి, నగలు విక్రయించే గదిలోకి వచ్చారు.
మేడ్చల్ జిల్లా: దొంగలు పోలీసులకే సవాల్ విసిరారు. ఏకంగా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్‌లో కలకలం రేపింది. శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌లోకి వెనుక గది గోడకు కన్నం వేసి చొరబడిన దుండగులు విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించారు.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణం వెనుక భాగంలోని గది గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం దుకాణంలో ఉన్న విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు.
చండీగఢ్: దీపావళి సందర్భంగా బంగారం లావాదేవిపై ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి మరణించగా, పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Man Killed, Cop Injured In Firing) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితులకు 1,400 గ్రాముల బంగారం ఇచ్చాడు. ఈ వివాదంపై ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా, ఆదివారం దీపావళి సందర్భంగా అమృత్‌సర్‌లోని సుల్తాన్‌విండ్ రోడ్డులో ఉన్న ‘రంఝే ది హవేలీ’ సమీపంలో ప్రతాప్ సింగ్ అతడి సోదరుడు, బంగారం ఇచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య మళ్లీ వాగ్వాదం చెలరేగింది. దీంతో ఒక వర్గం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బి డివిజన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) హర్నేక్ సింగ్, సీనియర్ కానిస్టేబుల్ సాహిబ్ సింగ్ అక్కడకు చేరుకున్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.