We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Thieves on a motorcycle stole a bag containing 2 kg of gold jewelry worth Rs. 6 crore from a jewelry merchant in Thiruvananthapuram, Kerala, on Thursday night. The police have started an investigation using CCTV footage to identify the suspects.
తిరువనంతపురం: కేరళం రాజధాని నగరమైన తిరువనంతపురంలో నగల దుకాణం మూసి ఇంటికి వెళ్తున్న ఓ వ్యాపారి నుంచి దుండగులు 2 కేజీల బంగారాన్ని దోచుకున్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. స్థానిక చలాయీ బజారు వ్యాపారి నందకుమార్ (50) గురువారం రాత్రి పదిన్నరకు దుకాణాన్ని మూసి స్కూటరుపై ఇంటికి బయల్దేరారు. అదే సమయంలో హెల్మెట్లు ధరించి ఉన్న ఇద్దరు దుండగులు వెనుక నుంచి బైకుపై వచ్చి అడ్డగించి.. ఆయన వద్ద ఉన్న నగల సంచిని లాక్కున్నారు. వ్యాపారి తేరుకునేలోపు అక్కడి నుంచి వారు అదృశ్యమయ్యారు. ఆ బ్యాగులో రూ.2.6 కోట్ల విలువైన రెండు కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
A probationary Sub-Registrar in Odisha was arrested by vigilance officials while accepting a ₹7,000 bribe for registering a land transaction. Following the incident, the government reportedly decided to terminate her services as she was still in her probation period.
In Medchal, thieves broke into Sri Jagadamba Jewellers on a busy national highway near the police station, stealing gold, silver, and cash worth approximately Rs. 84 lakhs.
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజుల్లో బంగారం ధర రూ.6,536 తగ్గింది. కార్తీక మాసంలో కూడా అడపాదడపా పెళ్లిళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. ఏడు నెలల తర్వాత 10 గ్రాముల బంగారం ధరలు ₹1.36 లక్షల కంటే పడిపోయాయి. చివరిగా.. మార్చి 23, 2026న, బంగారం ధర ₹1,35,141కి పడిపోయింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 10 గ్రాముల 24-క్యారెట్ బంగారం ధర ఒక రోజు క్రితం ₹1.38 లక్షల నుంచి నేడు (శుక్రవారం) ₹1,808 తగ్గి ₹1,35,884కు చేరింది.
జనవరి 8, 2026న, బంగారం ధర ₹1,35,773గా ఉంది. గురువారం నాటి ₹1.81 లక్షల నుండి కిలో వెండి ధర ₹3,540 తగ్గి ₹1.77 లక్షలకు పడిపోయింది. వరుసగా మూడు రోజుల్లో బంగారం ధర ₹6,536, వెండి ధర ₹8,500 తగ్గాయి. నవంబర్ 10న, 10 గ్రాముల బంగారం ధర ₹1.42 లక్షలు, కిలో వెండి ధర ₹1.86 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, పెద్ద పెట్టుబడిదారులు అధిక ధరలకు అమ్మడం కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.
ఇంటర్నెట్ డెస్క్: నగల దుకాణం మూసి వెళ్తున్న సమయంలో ఓ వ్యాపారి నుంచి దుండగులు 2 కేజీల బంగారాన్ని దోచుకున్నారు (Gold Robbery). ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి.. ఛాలై మార్కెట్లో వ్యాపారి నందకుమార్ దుకాణాన్ని మూసి ఇంటికి బయల్దేరారు. అదే సమయంలో హెల్మెట్లు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అడ్డగించి.. ఆయన వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కున్నారు. వ్యాపారి తేరుకునేలోపు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ బ్యాగ్‌లో రూ.2.6 కోట్ల విలువైన రెండు కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం జరిగిన ఓ ఘటనలో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Gold Price : దేశీయ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ (Inflation) గణాంకాలు, వడ్డీరేట్ల పెంపు అంచనాల కారణంగా అంతర్జాతీయ విపణిలో బంగారం, వెండి లోహాల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లో వెండి, బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ (గురువారం) ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ విపణిలో 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల బంగారం ధర (Gold Rate) రూ.1,42,350కు చేరింది.
క్రితం రోజుతో పోలిస్తే బంగారం ధర ఏకంగా రూ.1400 తగ్గింది. ఇక కిలో వెండి ధర రూ.1,86,550 పలికింది. బుధవారంతో పోలిస్తే వెండి ధర దాదాపు రూ.3 వేలకుపైనే తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 3,974 డాలర్లు, ఔన్సు వెండి ధర 51.48 డాలర్లు పలుకుతున్నాయి. బంగారం ధర ఈ స్థాయిలో దిగిరావడం నవంబర్ 4 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఇక మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో డిసెంబర్ డెలివరీకి బంగారం 10 గ్రాముల ధర రూ.1.38 లక్షలకు తగ్గింది. కేజీ వెండి ధర రూ.1.82 లక్షలకు దిగి వచ్చింది.
Gold Rate: దిగొచ్చిన బంగారం.. 10 గ్రాముల ధర ఎంతంటే..?
Not analysed for framing
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీరేట్ల పెంపు అంచనాలతో అంతర్జాతీయ విపణిలో ఈ లోహాల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ విపణిలో 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పసిడి ధర (Gold Rate in Hyderabad) రూ.1,42,350కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే పుత్తడి (Gold) ధర దాదాపు రూ.1400 తగ్గింది.
ఇక, కిలో వెండి (Silver) ధర రూ.1,86,550 పలికింది. బుధవారం నాటితో పోలిస్తే వెండి ధర దాదాపు రూ.3వేలకు పైనే తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 3,974 డాలర్లు, ఔన్సు వెండి ధర 51.48 డాలర్లు పలుకుతున్నాయి. బంగారం ధర ఈ స్థాయిలో దిగిరావడం నవంబరు 4 తర్వాత మళ్లీ ఇప్పుడే. ఇక, మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో డిసెంబరు డెలివరీకి బంగారం 10 గ్రాముల ధర రూ.1.38లక్షలకు తగ్గింది. కేజీ వెండి ధర రూ.1.82లక్షలకు దిగొచ్చింది.
బాలాసోర్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే లంచాలకు పాల్పడుతున్న ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాలో భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన మహిళా సబ్‌రిజిస్ట్రార్‌ను విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బలియాపాల్లో సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రొబేషనరీ అధికారి మనీషా మిశ్రా ఓ భూమి కొనుగోలుదారుడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పక్కా ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు. ఒడిశా రెవెన్యూ సర్వీస్ (ORS) అధికారి అయిన మనీషా మిశ్రా 2024లో సర్వీసులో చేరారు. ఆమె అరెస్టు అయిన సమయంలో ఇంకా ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్నారు.
దీపావళి పండుగ ముగిసిన తర్వాతి నుంచి బంగారం రేట్లు అనూహ్యంగా తగ్గుతూ నేలచూపులు చూస్తున్నాయి. ఇదే క్రమంలో వెండి రేట్లు కూడా పడిపోవటం షాపర్లకు మంచి అవకాశంగా మారుతోంది. ముఖ్యంగా రేట్లు తగ్గినప్పుడల్లా కొంటూ ఉండే తెలుగు ఫ్యామిలీలకు ఇదొక సదవకాశం. అయితే మీరు షాపింగ్ చేయటానికి నిర్ణయం తీసుకునే ముందు సమీప నగరంలోని తగ్గిన రిటైల్ రేట్లను పరిశీలించటం మంచిది.
నవంబర్ 11న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 71 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 198గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 015గా కొనసాగుతోంది.
మేడ్చల్ : నగల దుకాణంకు దుండగలు కన్నం వేశారు. ఆ కన్నంలో నుంచి లోపలికి ప్రవేశించి, బంగారం, వెండి నగలతో పాటు నగదు అపహరించారు. 24 గంటలు ప్రజలు సంచరించే జాతీయ రహదారి పక్కన, పోలీస్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న దుకాణంలో దుండగలు చోరీకి పాల్పడటం మేడ్చల్‌లో కలం కలం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ పోలీస్టేషన్ పక్కన ఉన్న దుకాణంలో శేషుమాల్ చౌదరి శ్రీ జగదాంబ జువెల్లర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఆయన దీపావళి పూజలు నిర్వహించి, దుకాణం మూసి వెళ్లిపోయాడు. సోమవారం దుకాణంను తెరవలేదు.
మంగళవారం ఉదయం చౌదరి దుకాణం తీసి చూడగా దుకాణం లోపల ఉన్న చెక్క తలుపు విరిగి ఉంది. కంగారుగా లోపలికి వెళ్లి చూడగా వెనుక ఉన్న గోడకు పెద్ద కన్నం వేసి ఉంది. దుండగలు వెనుక వైపు నుంచి దుకాణంకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. దుకాణంలోకి ప్రవేశించిన తర్వాత అడ్డుగా ఉన్న చెక్క తలుపు సగం వరకు తొలగించి, నగలు విక్రయించే గదిలోకి వచ్చారు.
మేడ్చల్ జిల్లా: దొంగలు పోలీసులకే సవాల్ విసిరారు. ఏకంగా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్‌లో కలకలం రేపింది. శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌లోకి వెనుక గది గోడకు కన్నం వేసి చొరబడిన దుండగులు విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించారు.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణం వెనుక భాగంలోని గది గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం దుకాణంలో ఉన్న విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు.
చండీగఢ్: దీపావళి సందర్భంగా బంగారం లావాదేవిపై ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి మరణించగా, పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Man Killed, Cop Injured In Firing) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితులకు 1,400 గ్రాముల బంగారం ఇచ్చాడు. ఈ వివాదంపై ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా, ఆదివారం దీపావళి సందర్భంగా అమృత్‌సర్‌లోని సుల్తాన్‌విండ్ రోడ్డులో ఉన్న ‘రంఝే ది హవేలీ’ సమీపంలో ప్రతాప్ సింగ్ అతడి సోదరుడు, బంగారం ఇచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య మళ్లీ వాగ్వాదం చెలరేగింది. దీంతో ఒక వర్గం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బి డివిజన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) హర్నేక్ సింగ్, సీనియర్ కానిస్టేబుల్ సాహిబ్ సింగ్ అక్కడకు చేరుకున్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.