We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Several major brands, including Haier, LG, and Bluestar, have announced a 3-7% price increase on their products ahead of Diwali, with Haavel's planning a further 5-7% hike by December 2026 due to rising raw material and logistics costs.
దసరా ఆఫర్లు మిస్సయ్యాం.. దీపావళికి భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయి.. కొందాం అనుకునే వాళ్లకు ఇది షాకింగ్ న్యూసే. ధరలు తగ్గుతాయి అనుకుంటే కొండెక్కి కూర్చున్నాయి. కనీసం 3 నుంచి 7 శాతం వరకు రేట్లు పెరిగాయి. చివరికి స్వీట్ల ధరలు కూడా పెరగటం ఆందోళనకరం. ఏ ఏ వస్తువుల రేట్లు ఎంత మేరకు పెరిగాయో చూద్దాం.
హయర్, ఎల్జి, బ్లూస్టార్ వంటి బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను 3-7 శాతం పెంచాయి. హావెల్స్ కూడా 2026 డిసెంబర్ నాటికి 5-7 శాతం వరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. రా మెటీరియల్స్ ధరలు, డెలివరీ ఖర్చులు పెరగడమే దీనికి కారణం అని పేర్కొంటున్నారు.
The Brihanmumbai Municipal Corporation (BMC) deleted a Diwali video featuring actress Dia Mirza from its social media account after the Mumbai BJP chief objected to it. The video promoted a pollution-free Diwali, aligning with recent High Court orders regarding firecracker usage.
హిందువులు ఎంతో ఆనందంగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపాల పండుగగా పేరొందిన దీపావళి కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో మెరిసిపోతుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కొత్త బట్టలు ధరించి కుటుంబంతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
2026లో దీపావళి పండుగను నవంబర్ 8, ఆదివారం రోజున రానుంది. అయితే దీపావళి వేడుకలు ఒక్కరోజుతో ముగియవు. ధన్‌తేరస్‌తో ప్రారంభమై భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పాటు వివిధ పండుగలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది.
ముంబై: దివాళీ పటాకుల గురించి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన నటి దియా మీర్జా(Dia Mirza) వీడియోను డిలీట్ చేసింది. ఆ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బీఎంసీ ఆ చర్యకు పాల్పడింది. కాలుష్య రహిత దివాళీ చేసుకోవాలని వీడియోలో నటి దియా మీర్జా కోరింది. అయితే ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సత్నం ఆ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాజకీయ వివాదం రేగింది. భారీగా బాణాసంచా కాల్చవద్దు అని, పర్యావరణహితంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని ఇటీవల ముంబై హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. కాలుష్య నియంత్రణ కోసం హై కోర్టు ఆ ఆదేశాలు…
హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ఈ ఏడాది(2026) దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి. చీకటిపై వెలుగుల విజయానికి సంకేతమైన ఈ పండుగలో, లక్ష్మీదేవి పూజశుభ ముహూర్తం ఎప్పుడు.. దీపావళి పండుగ పూజా సమయం.. తేదీ మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . .
హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి. ప్రతి ఏడాది ఆశ్వయుజమాసం అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. చీకటిపై వెలుగుకు ప్రతీకగా ఈ పండుగను నవంబర్ 8 వ తేదీన జరుపుకుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి లక్ష్మీ గణేశులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
దీపావళి పండుగ మరో కొద్ది రోజుల్లో రాబోతుంది. దీపావళి ముందు నరక చతుర్థశిని జరుపుకుంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం కొంతమంది నరకచతుర్ధశి( 2026 నవంబర్7) హనుమంతుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయుడిని పూజించిన వారికి బలం, ధైర్యం కలగడమే కాకుండా .. ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 7 వ తేదీన హనుమంతుడిని పూజించేందుకు శుభ ముహూర్తం.. పూజా విధానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పూర్వీకుల నమ్మకాల ప్రకారం ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్ధశి రోజు దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు, చెడు భావనలు గరిష్టస్థాయిలో ఉంటాయి. అంతే కాదు ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇలాంటి వాటిని తొలగించుకొనేందుకు నరకచతుర్ధశి రోజు హనుమంతుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మిల్లెట్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు కేఫ్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేఫ్‌ల ఏర్పాటుకు మొత్తం రూ.11 కోట్లు ఖర్చు చేయనుండగా, ఒక్కో కేఫ్‌కు రూ.2.2 కోట్ల చొప్పున కేటాయించనున్నారు.
నవంబర్ 19న ప్రారంభించేందుకు సన్నాహాలుమహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అద్దె ఆర్టీసీ బస్సులు, డెయిరీ ఫామ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నవంబర్ 19న ఈ కేఫ్‌లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి విడతలో హైదరాబాద్‌లో మూడు, యాదాద్రి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 40 మంది మహిళలకు అవసరమైన శిక్షణ కూడా అందించారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు.…
గత నెల చివరి వారంలో అనూహ్యంగా పతనం అయిన బంగారం, వెండి రేట్లు మళ్లీ నవంబర్ మాసంలో తిరిగి పుంజుకుంటున్నాయి. దీంతో దీపావళికి షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వారికి రేట్లు భారంగా మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రస్తుతం షాపింగ్ చేయాలని అనుకుంటున్నట్లయితే సోమవారం రోజున తమ సమీప నగరాల్లో మారిన రిటైల్ గోల్డ్ అండ్ సిల్వర్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
నవంబర్ 2న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు నవంబర్ 1 కంటే రూ.49 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 937గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 775గా కొనసాగుతోంది.
Festivals In November 2026: దీపావళి విజయ ముహూర్తం ఎప్పుడు? నవంబరులో పండుగలు, ప్రత్యేకతలివే
Not analysed for framing
Diwali 2026| ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సనాతన ధర్మంలో కార్తిక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శివకేశవుల ఆరాధనకు, దీపారాధన, ఉపవాస నియమాలకు, దాన ధర్మాలకు ఈ మాసం ఎంతో ప్రత్యేకం. దీపావళి పర్వదినం నుంచి కార్తిక పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, ధార్మిక సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
గాంధీనగర్: దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన 143 మంది ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. ధంతేరస్ అయిన నవంబర్ 6న వారిని విడుదల చేయనున్నది. దీంతో ఆ ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి 15 రోజులు ఉండనున్నారు. తమ వారితో కలిసి దీపావళి జరుపుకుంటారు. (Diwali Parole) ఖైదీల సంక్షేమం, జైలు సంస్కరణల కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఖైదీలు వారి కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకునే అవకాశాన్ని కల్పించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 143 మంది అర్హులైన ఖైదీలకు 15 రోజుల దీపావళి పెరోల్‌ను మంజూరు చేశారు.…
కాగా, గుజరాత్ ప్రభుత్వం 2003 నుంచి ప్రతి సంవత్సరం అర్హులైన ఖైదీలకు దీపావళి సందర్భంగా 15 రోజుల పెరోల్‌ను మంజూరు చేస్తున్నది. అర్హులైన మహిళా ఖైదీలు, 60 ఏళ్లు పైబడిన అర్హులైన పురుషులకు ఇది లభిస్తుంది. దీని కోసం సంబంధిత నియమ నిబంధనలతో పాటు కొన్ని మార్గదర్శకాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
తెలంగాణలోని గిరిజన తండాల్లో దీపావళి వేడుకలకు ప్రత్యేకతే వేరు. ప్రకృతితో మమేకమైన జీవనం... పశుసంపదపై అపారమైన ప్రేమాభిమానాలు... తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలు! వ్యవసాయానికి అండగా నిలిచే పశువులను పూజిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో పండుగను జరుపుకుంటారు.
పశువులను పూజించడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు తమ జీవనాధారంపై కృతజ్ఞత కూడా ఉంది! ప్రకృతిని ఆరాధిస్తూ... సంప్రదాయాలను గుండెల్లో దాచుకుంటూ... గిరిజన తండాలు చాటుతున్న సందేశం ఒక్కటే.. ప్రకృతిని ప్రేమించాలి... జీవనాధారాలను గౌరవించాలి. ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాల్లోని అన్ని గిరిజన తెగలూ దీపావళిని వివిధ రకాలుగా జరుపుకుంటారు. గోవర్ధన పూజ, పశువుల ఆరాధన, తండా ఆచారాలను బట్టి చేస్తారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.