We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Warangal West MLA Nainala Rajender Reddy participated in Diwali celebrations with beneficiaries of the Indira Awas Yojana (Indiramma) in Gokul Nagar, Warangal.
వరంగల్ ఎన్జీవో కాలనీ: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని 57వ డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు అయిన కొమురమ్మ కుటుంబంతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు నూతన వస్త్రాలు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులకు స్వీట్లు తినిపించి, వారితో కలిసి బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఒక కుటుంబానికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Chief Minister Revanth Reddy inaugurated an Indiramma house in Parsapur village, Kodangal mandal, and shared a meal and Diwali celebrations with the beneficiary family. The event was attended by Speaker Gaddam Prasad Kumar, several ministers, and other MLAs.
Telangana Minister Ponnam Prabhakar celebrated Diwali with beneficiaries of the Indiramma housing scheme in the Hanumakonda district, distributing sweets and firecrackers. He also cut a cake to mark Chief Minister Revanth Reddy's birthday.
The article describes several villages across Tamil Nadu and Assam that celebrate 'Silent Diwali' by forgoing firecrackers to protect local birds and bats. These traditions, passed down through generations, involve lighting lamps, performing prayers, and sharing sweets instead.
సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించిన ఇంటిని సీఎం ప్రారంభించారు.
పర్సాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతుల నూతన గృహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి ప్రారంభోత్సవం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారుల కుటుంబంతో కలిసి వారి ఇంట్లోనే భోజనం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో తయారుచేసిన భోజనం తిన్నారు.
లింగంపేట: కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కాంగ్రెస్ నాయకులు దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచి కౌడ రవి, లింగంపేట పీఏసీఎస్ ఛైర్మన్ బుర్ర నారా గౌడ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి ప్రసాద్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరులో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ నివాసాల్లో ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం ఆదివారం వేడుకగా జరిగింది. కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడంతోపాటు ఇళ్ల లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులకు స్వయంగా స్వీట్లు తినిపించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతోపాటు కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Upcoming Movies New posters released: దీపావళి స్పెషల్.. కొత్త పోస్టర్లు రిలీజ్
Entertainment — not analysed for political framing
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సినీ అభిమానులకు డబుల్ ధమాకాను తీసుకొచ్చింది. పండుగ కానుకగా తమ సినిమాల అప్డేట్స్తో మేకర్స్ సందడి చేస్తున్నారు. రాబోయే క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. ఈ దీపావళికి సందడి చేస్తున్న ఆ సరికొత్త పోస్టర్లపై ఓ లుక్కేద్దాం..
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్ 100’ (King 100). తమిళ నటుడు అశోక్ సెల్వన్ (AshokSelvan) ఈ సినిమాలో ‘కర్ణ’గా మాస్ అవతార్‌లో కనిపించనున్నారని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. శక్తిమంతమైన పాత్రలో అశోక్ సెల్వన్ నటిస్తున్నట్లు వెల్లడించింది. రా.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా.. డిసెంబర్ 24న విడుదల కానుంది.
Silent Diwali | దీపావళి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా బాణసంచా సందడి మొదలవుతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాలుస్తూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అయితే మన దేశంలో కొన్ని గ్రామాల్లో మాత్రం దీపావళి రోజు బాణసంచా కాల్చరు. కనీసం పెద్ద శబ్దాలు చేసే టపాసుల జోలికి కూడా వెళ్లరు. పండుగను దీపాలు వెలిగించి, పూజలు చేసి, స్వీట్లు పంచుకుంటూ జరుపుకుంటారు. ఇదేదో ప్రభుత్వ ఆంక్షల వల్ల అనుకుంటే పొరబడినట్లే. తమ గ్రామాల్లో నివసించే పక్షులు, గబ్బిలాలు, ఇతర జీవులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఆ గ్రామాలు ఎక్కడ ఉన్నాయి? వాటి వెనుక ఉన్న…
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉన్న బాల్లెనహళ్లి గ్రామంలో దీపావళి వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ దాదాపు 2 వేల గబ్బిలాలు గ్రామంలోని ఆలయం సమీపంలో ఉన్న చెట్లపై నివసిస్తున్నాయి. వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని గ్రామస్తులు బాణసంచా కాల్చడం మానేశారు. నాలుగు తరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గబ్బిలాలను కూడా తమ గ్రామ దేవుడు మునియప్పతో సమానంగా భావిస్తామని చెబుతున్నారు. పిల్లలకు టపాసులు కాల్చాలనిపిస్తే గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పొలాల వైపు వెళ్లి కాల్చుకోవాలని సూచిస్తారు. పండుగ రోజున ఇక్కడ దీపాలు వెలిగించి, పూజలు చేసి, విందు భోజనాలతో ఆనందంగా గడుపుతారు.
Entertainment — not analysed for political framing
IdupuKayitham | ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’ (IdupuKayitham) . ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోందని తెలిసిందే.
ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఇడుపు కాయితం సినిమా నుంచి ‘బారాత్ బీట్ ‘.. (BaraatBeat) సాంగ్ రిలీజ్ చేశారు.
పచ్చని తోరణాలు... ఇంటి నిండా దీపాలతోపాటు రంగుల రంగవల్లికలూ దీపావళికి కళ తెస్తాయి కదా! మార్కెట్లో దొరికే రసాయనాల రంగులతో ముగ్గులు వేస్తే దురద, అలర్జీలు వస్తాయి.
పచ్చని తోరణాలు... ఇంటి నిండా దీపాలతోపాటు రంగుల రంగవల్లికలూ దీపావళికి కళ తెస్తాయి కదా! మార్కెట్లో దొరికే రసాయనాల రంగులతో ముగ్గులు వేస్తే దురద, అలర్జీలు వస్తాయి. ఇలాకాకుండా వంటగదిలో దొరికే పదార్థాలతోనే ఇటు ఆరోగ్యానికీ, పర్యావరణానికీ మేలు చేసే సహజ రంగుల్ని తయారుచేయండి.
దీపావళి పండుగ సందర్భంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 2026 నవంబర్ 5వ తేదీన సీఎం రేవంత్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల25 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయినందున.. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి కార్యక్రమంలో పాల్గొనాలని సమావేశం నిర్ణయించింది.
ముంబయి : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 10 శాతానికి పైగా తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐ) కొనుగోళ్లు, అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగలడం, దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో గురువారం సెన్సెక్స్ 2,008.61 పాయింట్లు లేదా 2.60 శాతం దూసుకెళ్లి 79,310 వద్ద ముగిసింది. నిఫ్టీ 576 పాయింట్లు లేదా 2.40 శాతం లాభపడి 24,537కు చేరింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,160 పాయింట్లు, నిఫ్టీ 619 పాయింట్ల మేర ఎగిశాయి. దీంతో వరుసగా ఆరో సెషన్లోనూ మార్కెట్లు ర్యాలీని కొనసాగించాయి. బిఎస్ఇలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.6.5 లక్షల కోట్లకు పైగా…
ఈ ర్యాలీకి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు 10 శాతానికి పైగా పతనమై బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరడం దోహదపడింది. మరోవైపు ఈ వారం తొలి మూడు ట్రేడింగ్ సెషన్లలోనే విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.17,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా రావడంతో ఇకపై ట్రంప్ తన దూకుడును తగ్గించవచ్చనే అంచనాలు మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చాయని బ్రోకర్లు పేర్కొంటున్నారు.
హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ధనత్రయోదశి రోజును చాలా భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీనినే దంతేరాస్ అనికూడా అంటారు. అలాంటి పవిత్రమైన రోజు ఈ ఏడాది (2026) నవంబర్ 6 వ తేదీ వచ్చింది. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని.. ధన్వంతరి భగవానుడిని..సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు. మరి ఈ ఏడాది దంతేరాస్ రోజుకు లక్ష్మీదేవికి శుభముహూర్తం ఎప్పుడు ... ఎలా పూజ చేయాలి.. ఎందుకు పూజించాలో మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందువులు ధనత్రయోదశి పండుగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. దేవతలు.. రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథించే సమయంలో లక్ష్మీదేవి ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజున జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో విష్ణుమూర్తి ఆమెను భార్యగా స్వీకరించి .. సిరి సంపదలకు, ఐశ్వర్యానికి అధి దేవతగా ప్రకటించారు.
లక్నో: యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన కింద అర్హత కలిగిన పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఉచితంగా ఒక్కో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1.89 కోట్లకు పైగా పేదలకు ఈ ప్రకటనతో లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద సబ్సిడీల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించింది. 'ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.983.45. కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.335 సబ్సిడీ అందిస్తుంది.
లబ్ధిదారులు రూ.648.55 చెల్లించాల్సి ఉంటుంది. కానీ పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సిలిండర్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. మీరు ఆదా చేసే డబ్బుతో దీపావళి మిఠాయిలు, ప్రమిదలు కొనుగోలు చేసుకోవచ్చు' అని సీఎం యోగీ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని, ప్రస్తుత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని, ఇదే అసలైన సుపరిపాలన అని కొనియాడారు. నవంబర్ 7న జరగనున్న అయోధ్య దీపోత్సవం సామాజిక ఐక్యతకు ప్రతీక అని అభివర్ణించారు. కుల, మత…
దీపావళికి సంబంధించి బౌద్ధంలో రెండు సందర్భాలున్నాయి. వాటిని ఒకసారి గుర్తుచేసుకుందాం. ఒకటి- ఆషాఢ పౌర్ణమి నుంచి ఆశ్వయుజ పౌర్ణమి వరకూ బౌద్ధ భిక్షువులు వర్షావాసం చేస్తారు. వర్షాకాలం వలన ఈ నాలుగు నెలలు ఏదో ఒక గ్రామంలోనే బస చేస్తారు. అలా వర్షావాసం ముగించుకుని, బుద్ధుడు తొలిసారి కపిలవస్తు నగరాన్ని సందర్శించాడు. తథాగతునికి స్వాగతం పలుకుతూ రాజ్యమంతా వేడుకలు జరిగాయి. ఆయన రాకకు హర్షాతిశయంతో ప్రజలు ఇళ్ల ముందు, రహదారులకు అటూ ఇటూ దీపాలు వెలిగించి.. ‘ధమ్మ దీపావళి’గా చేసుకున్నారు. ఈ రోజున దీపాలు వెలిగిస్తారు. బౌద్ధంలో దీపం అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది అవిద్య అనే అంధకారాన్ని తొలగించి, జ్ఞానదీప్తిని…
రెండు- కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధ హింసను విడనాడి ఉపగుప్తుని సమక్షంలో బౌద్ధధర్మాన్ని స్వీకరించాడు. ధమ్మ ప్రచారం కోసం అశోకుడు వేలాది బౌద్ధ స్థూపాలు, బౌద్ధ విహారాలు నిర్మించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నగరాలన్నింటినీ దీపాలతో అలంకరించి.. ‘ధమ్మ దీపావళి’గా వేడుక చేసుకున్నారు.
అతని జీతం నెలకు 50 వేల రూపాయలు.. పని చేసేది ఐటీ కంపెనీలో అనుకోండి.. ఆ కంపెనీ దీపావళి బోనస్ ఇవ్వాలి అనుకుంటే ఎంత ఇస్తుంది.. రెండు, మూడు నెలల జీతం లేదా ఓ ఐఫోన్.. లేదా ఐదు, 10 లక్షల కారు ఇస్తుంది.. అవును కదా.. ఇప్పటి వరకు అలాగే చూశాం.. విన్నాం. ఇప్పుడు మాత్రం ఓ ఐటీ కంపెనీ.. తన ఉద్యోగులకు దీపావళి బోనస్ కింద ఏకంగా 4 సంవత్సరాల జీతం ఇచ్చింది.. అంటే 50 వేల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగి.. ఏకంగా 25 లక్షల రూపాయల బోనస్ అందుకోనున్నాడు.. ఇంత బోనస్ ఇస్తున్న ఐటీ కంపెనీ ఏంటీ.. ఈ బోనస్ నిజమేనా.. ఇండియాలోనా లేకపోతే విదేశాల్లోనా.. అసలు ఇది నిజమా కాదా అనేది పూర్తి తెలుసుకుందామా...
మైక్రాన్ కంపెనీ ఇండియాలోని తమ ఉద్యోగులకు 3 నుంచి 4 ఏళ్ళ జీతాన్ని బోనస్ గా ఇస్తోందని రెడిట్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ రేంజ్ బోనస్ ఇస్తున్నారన్న వార్తలు నిజమేనని... తమ కంపెనీ భారీగా క్యాష్, స్టాక్ అవార్డ్స్ ఇస్తోందంటూ టెకీ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
దీపావళి పండుగ సందర్భంగా ఓ కంపెనీ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి సప్రయిజ్ చేసింది. సాధారణంగా పండుగలకు కంపెనీలు స్వీట్లు, బట్టలు లేదా ఏదైనా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటాయి. కానీ ఢిల్లీలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ, ఉద్యోగులకు ఐఫోన్లు బహుమతిగా ఇచ్చిన వీడియోను అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఉద్యోగుల డెస్క్‌లపై అందంగా రిబ్బన్లు కట్టిన ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తున్నాయి. దీపావళి పండుగ వేడుకల్లో భాగంగా కంపెనీ ఈ సర్ప్రైజ్ ఇచ్చింది.
దీపావళి అంటేనే ప్రత్యేకమైన పండుగ. నోరూరించే స్వీట్లు, మిరుమిట్లుగొలిపే దీపాల వెలుగులు. హోరెత్తించే క్రాకర్స్... ఇలా ఎంతో హడావిడి ఉండే సంబురం దీపావళి. ఈ పండుగలో అన్నింటికంటే స్వీట్స్ కాస్త ఎక్కువ స్పెషల్. బయటినుంచి తెచ్చుకునే స్వీట్స్ కంటే... ఇంట్లో చేసుకుంటే అవి ఇంకింత బాగుంటాయి.తియ్యటి స్వీట్స్ , మనసారా ఇచ్చే పర్సనల్ టచ్ స్పెషలే కదా మరి! బి స్వీట్స్ రెసిపీస్ మీ కోసం...!
రెండు రకాల చాక్లెట్ ను వేరు వేరు గిన్నెల్లో తీసుకుని వాటిని కరిగించాలి. కరిగించిన చాక్లెట్స్ రెండింటినీ ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ సిరీస్ లో మీకు నచ్చిన ఫ్లేవర్ కలుపుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్నా వేసుకోవచ్చు ఈ చాక్లెట్ మెర్టెడ్ సిరప్ క్రాకర్స్ సిలికాన్ చాక్లెట్ మాల్స్ లో వేయాలి. ఈ మాల్స్ ను పావుగంట డీప్ ఫ్రిజ్ లో పెట్టి బయటకు తీయాలి. బయటకు తీశాక వాటిని గోల్డెన్ ఫాయిల్ పేపర్లో చుట్టాలి. వీటి పై క్రాకర్స్ స్టిక్కర్స్ అంటిస్తే మమ్మీ క్రాకర్స్ స్వీట్స్ తినేందుకు సిద్ధంగా ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళిని పురస్కరించుకుని.. దిల్లీకి చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఉద్యోగులందరికీ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ (iPhone 16)లను ఇచ్చింది.(Diwali Gifts). రోహిణి ప్రాంతంలోని ‘ఫైనాన్సర్సాబ్’ అనే సంస్థ (Delhi Company) ఉద్యోగులు రాకముందే.. వారి డెస్క్‌లపై ఐఫోన్ 16 హ్యాండ్సెట్లు ఏర్పాటు చేసింది. ఆఫీస్‌కు రాగానే తమ డెస్క్‌లపై ఉన్న ఐఫోన్లు చూసి.. ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను ఆ సంస్థ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను షేర్ చేస్తూ.. మరి మీ కంపెనీలు ఏం ఇచ్చాయి? అంటూ ఆ సంస్థ క్యాప్షన్ పెట్టింది. దీపావళి సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, నిత్యావసర వస్తువులను ఇస్తుంటాయి. అందుకు భిన్నంగా ఈ సంస్థ ఐఫోన్లు ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో చేరడానికి ఏమైనా ఖాళీలు ఉంటే చెప్పండంటూ ఓ నెటిజన్ సరదాగా స్పందించారు. ఇదీ చదవండి: ఆ టపాసుల సంగతేంటో చూడండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.