We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
According to the report, the Jaisri Ram paddy variety achieved an all-time record price of Rs 5,016 per quintal at the Kesamudram market in Mahabubabad district. Other crops, including RNR paddy, maize, cotton, and pigeon peas, also fetched record prices during the auction.
నెల్లికుదురు (కేసముద్రం)/ మహబూబాబాద్, వెలుగు: జైశ్రీరాం రకం వడ్లు రికార్డు ధర పలికాయి. మహబూబాబాద్జిల్లా కేసముద్రం మార్కెట్ కు గతేడాది సాగు చేసిన జైశ్రీరాం రకానికి చెందిన ఐదు బస్తాల వడ్లను ఓ రైతు శుక్రవారం అమ్మకానికి తెచ్చారు. ఈ–నామ్ విధానంలో వడ్లను వేలం వేయగా క్వింటాల్వడ్లు రూ.5,016 ఆల్టైమ్రికార్డ్ ధర లభించింది. కేసముద్రం మార్కెట్లో ఇతర పంటలకూ భారీ ధర పలికింది. ఆర్ఎన్ఆర్ రకం వడ్లకు గరిష్టంగా క్వింటాల్‌కు రూ.4,782 రేటు వచ్చింది. మక్కలకు కూడా రికార్డ్ ధర లభించింది. వీటికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.3,036, కనిష్టంగా రూ.2,461 రేటు పలికింది. పత్తి క్వింటాల్ రూ.9,111, కందులు రూ.10,989…
According to the article, brokers from neighboring states are purchasing minor millets from farmers in Telangana at high prices, leading to a projected 30% increase in millet prices.
కడపత్రి ప్రకాశ్‌రావు, కరీంనగర్ ప్రతినిధి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జమ్మికుంట: తెలంగాణలో పండిన సన్న ధాన్యాన్ని ఇతర రాష్ర్టాల బ్రోకర్లు తన్నుకుపోతున్నారు. పంట కోతకు రాగానే గద్దల్లా పొలాల వద్ద వాలిపోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల వ్యాపారులు మన రైతులకు ముందస్తుగా అడ్వాన్సులు చెల్లిస్తూ పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమవుతున్నది.
ఫలితంగా ఇప్పటికే ఆకాశాన్ని అంటిన సన్నబియ్యం ధరలు వచ్చే 2-3 నెలల్లో మరో 30% మేరకు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ప్రస్తుత యాసంగిలో పండిన సన్నధాన్యం కొనుగోలుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నదని ఇప్పటికే అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని, పండిన ప్రతి ధాన్యం గింజనూ జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు…
మాగనూరు, అక్టోబర్ 22 : ప్రభుత్వ ధాన్యం నిల్వలకు రక్షణ కరువైందా? కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని మిల్లులో భద్రపరిచిన అధికారులు ఆ నిల్వలను పర్యవేక్షించడంలో విఫలమయ్యారా? మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ పరిధిలోని శంకర్ లింగ రైస్ మిల్లులో వెలుగుచూసిన భారీ ధాన్యం గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది. సుమారు రూ.7.85 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
80,972 బస్తాలు ఎక్కడికి వెళ్లాయి? ఎన్ఫోర్స్మెంట్ డీఎస్ఓ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 2024లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్ లింగ రైస్ మిల్లులో సుమారు 76 వేల బస్తాల ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు కేటాయించారు. అదేవిధంగా 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి మరో 4,972 బస్తాల ధాన్యం కలిపి మొత్తం 80,972 బస్తాలను మిల్లులో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా తనిఖీలు నిర్వహించగా మిల్లులో ఒక్క బస్తా ధాన్యం కూడా లేకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఈ ధాన్యం విలువ రూ.7,85,30,918గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.