We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి 8 వరకు ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమై 33 జిల్లాలను చుట్టిరానుంది. డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయి.
* తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా క్రీడా జ్యోతి * డిసెంబరు 1 నుంచి 8 వరకు ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీ * 33 జిల్లాలను చుట్టిరానున్న క్రీడా జ్యోతి * ఉత్తర, దక్షిణ తెలంగాణలో రెండు వేర్వేరు మార్గాలు * ఎల్బీ స్టేడియం నుంచి ర్యాలీలకు శ్రీకారం * జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి ర్యాలీలు స్టార్ట్ * రాజధానిలో ప్రత్యేక ప్రచార వాహనాలు.. సెల్ఫీ పాయింట్లు
Khelo India: ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు.. సంగారెడ్డి నుంచి భద్రాద్రి వరకు.. తెలంగాణ అంతటా ఖేలో ఇండియా క్రీడల సందడి మొదలైంది. జాతీయ క్రీడల స్ఫూర్తిని రాష్ట్రంలోని 33 జిల్లాలకు చాటేలా క్రీడా జ్యోతి యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి రెండు ప్రత్యేక వాహనాలతో యాత్రను చేపట్టనున్నారు. ఒక వెహికిల్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, మరో వాహనం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పర్యటించనుంది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ యాత్రకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of Telangana - SATG) షెడ్యూల్‌ను ఫిక్స్ చేసింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిసెంబర్ 21న నిర్వహించనున్న స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని యూనివర్సిటీ ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల నవంబర్ 30 నాటికి అల్పపీడనం రూపుదిద్దుకోనుందని ఆ సంస్థ తెలిపింది.
ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బంగాళాఖాతంలో నవంబర్ 30 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. డిసెంబర్ 2 నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Entertainment — not analysed for political framing
శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”. దివంగత నటుడు మాదాల రంగారావు మనవడు, నటుడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతుండగా, మౌనిక వీర్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర బృందం టీజర్ లాంఛ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరో సన్నీ మాదాల మాట్లాడుతూ, ఈ సినిమాకు వచ్చే క్రెడిట్ అంతా తమ దర్శకనిర్మాత శ్రీకర్ కృష్ణకే దక్కుతుందని, ఆయనే అన్నీ దగ్గరుండి చూసుకున్నారని తెలిపారు. చిత్రీకరణలో ఏదైనా కష్టం ఉంటే ఆయన భరించి, తమకు మాత్రం ప్రేమను పంచారని కొనియాడారు. టెక్నీషియన్స్ అంతా సినిమాకు బలాన్నిచ్చారని, హీరోయిన్ మౌనిక తొలి చిత్రమైనా ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తన కుటుంబ సభ్యులు ఎంతో అండగా నిలిచారని, సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందని సన్నీ అన్నారు.
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( Agri-University) లో డిసెంబర్ 21న నిర్వహించనున్న స్నాతకోత్సవానికి( Convocation) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Murmu ) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని యూనివర్సిటీ ఉప కులపతి అల్దాస్ జానయ్య ( Vice-Chancellor Janaiah ) తెలిపారు.
రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి శివ్ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగే స్నాతకోత్సం లో 2025-26 విద్యా సంవత్సరం లో పీహెచ్డీ పూర్తి చేసిన 40 మంది విద్యార్థులకు , పీజీ పూర్తి చేసిన 100 విద్యార్థులకు , యూజీ పూర్తి చేసిన 1000 మంది విద్యార్థులకి రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు అందచేయనున్నట్లు వెల్లడించారు.అదే విధంగా అత్యంత ప్రతిభ కనపర్చిన 17 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రధానం చేయనున్నట్లు వివరించారు.
బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకోనుంది. సముద్రంలో కొత్తగా అల్పపీడనం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనమే దీనికి కారణంగా నిలవనుంది.ఈ ఆవర్తన ప్రభావం వల్ల నవంబర్ 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిధిలో అల్పపీడనం రూపుదిద్దుకోనుంది. ఆ తర్వాత ఇది క్రమంగా మరింత శక్తిని పుంజుకోనుంది. డిసెంబర్ 2 నాటికి ఇది వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశముంది. తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు ఇది వెళ్లొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే తీరం…
డిసెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, పెన్షన్‌కి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక మార్పులు రానున్నాయి. ఎస్బీఐ కార్డ్ ఛార్జీల పెంపు, కమోడిటీ మార్కెట్ మార్జిన్ రూల్స్, విదేశీ ఇన్వెస్టర్లకు కేవైసీ మార్పులు వంటి మార్పులు అమలులోకి రానున్నాయి. వీటితో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నందున వాటి ప్రభావం మనపై ఎంత వరకూ ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..
SBI కార్డ్ ఛార్జీల పెంపు: SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు డిసెంబర్ 1 నుంచి ట్రాన్స్పోర్ట్, ఇంధన లావాదేవీలపై అదనపు ఛార్జీలు పడనున్నాయి. రవాణా రంగానికి చెందిన లావాదేవీలు రూ.30 వేలు దాటితే 1 శాతం ఛార్జీ విధిస్తారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు రూ.40 వేలు ఖర్చు చేస్తే.. మొత్తం చేసిన ఖర్చుపై రూ.400 అదనపు ఫీజు పడుతుంది. ఇంధన ఖర్చుల విషయంలో ఒక బిల్లింగ్ సైకిల్లో ఎస్బీఐ కార్డ్ ద్వారా చేసే ఖర్చు రూ.50 వేలు దాటితే 1 శాతం ఫీజు విధిస్తారు. రూ.60 వేల ఇంధన లావాదేవీలు చేస్తే రూ.600 ఛార్జీతో పాటు వర్తించే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
Nandi Awards | నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 9 ఏళ్ల పురస్కారాలు ఒకేసారి, డిసెంబర్లో గ్రాండ్ ఈవెంట్!
Entertainment — not analysed for political framing
Nandi Awards | తెలుగు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. ప్రతిష్టాత్మక నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ పురస్కారాలను మళ్లీ అందించేందుకు అధికారికంగా చర్యలు ప్రారంభించింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులను ప్రకటించి, 2026 డిసెంబర్లో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి నంది అవార్డుల సందడి మొదలుకానుంది. నంది అవార్డుల పునరుద్ధరణ…
ఇక 2025 సంవత్సరానికి మాత్రం అన్ని ప్రధాన విభాగాల్లో పూర్తి స్థాయిలో నంది అవార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులకు గుర్తింపు లభించనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో సినీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నంది అవార్డుల ప్రదానోత్సవంలో సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగానికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పించింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది ఉత్తమ మెగా సీరియల్, రెండో ఉత్తమ మెగా సీరియల్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ప్రకటించనున్నారు.
Kachapur | శంకరపట్నం, నవంబర్ 26 : గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేసి, సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కాచాపూర్ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు పాలకమండలిలో ఏకగ్రీవ తీర్మాణం చేసినట్లు వారు గురువారం తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయాల కారణంగా అనేక కుటుంబాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయని, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఇటీవల బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు ఆందోళన చేపట్టి గ్రామ పంచాయతీకి తమ సమస్యలను విన్నవించారు.
మహిళలు తెలిపిన సమస్యలను పరిగణనలోకి తీసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ అంశంపై గ్రామసభలో తీర్మానం చేసి సంబంధిత ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు పంపించాలని నిర్ణయించింది. బెల్ట్ షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, డిసెంబర్ 1లోగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయించాలని నిర్ణయించినట్లు సర్పంచ్, ఉప సర్పంచ్ వెల్లడించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ మద్యం విక్రయాలు కొనసాగిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని, పాలకవర్గం తరఫున కూడా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం వ్యసనం కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని, ఇంట్లోని వస్తువులు సైతం తాకట్టు పెట్టి మద్యం…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.