Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Kachapur | డిసెంబర్1లోగా కాచాపూర్‌లో బెల్ట్ షాపుల మూసివేయాలి.. తీర్మాణం చేసిన గ్రామ పంచాయతీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కాచాపూర్ గ్రామ పంచాయతీలో బెల్ట్ షాపులను మూసివేసి సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో మద్యం విక్రయాల కారణంగా కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ మేరకు సంబంధిత ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు పంపించాలని నిర్ణయించి, డిసెంబర్ 1లోగా మద్యం విక్రయాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Kachapur | శంకరపట్నం, నవంబర్ 26 : గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేసి, సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కాచాపూర్ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు పాలకమండలిలో ఏకగ్రీవ తీర్మాణం చేసినట్లు వారు గురువారం తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయాల కారణంగా అనేక కుటుంబాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయని, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఇటీవల బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు ఆందోళన చేపట్టి గ్రామ పంచాయతీకి తమ సమస్యలను విన్నవించారు.
మహిళలు తెలిపిన సమస్యలను పరిగణనలోకి తీసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ అంశంపై గ్రామసభలో తీర్మానం చేసి సంబంధిత ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు పంపించాలని నిర్ణయించింది. నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, డిసెంబర్ 1లోగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయించాలని నిర్ణయించినట్లు సర్పంచ్, ఉప సర్పంచ్ వెల్లడించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ మద్యం విక్రయాలు కొనసాగిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని, పాలకవర్గం తరఫున కూడా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం వ్యసనం కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని, ఇంట్లోని వస్తువులు సైతం తాకట్టు పెట్టి మద్యం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)