We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బిజినెస్‌లు, స్టార్టప్‌లకు మరింత ఊతమిచ్చే లక్ష్యంతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని ‘ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హైదరాబాద్’ (టీఐఈ) ప్రకటించింది. ఈనెల 20న హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్. ఈ సదస్సుకు 2,000 మందికి పైగా వ్యాపారవేత్తలు, 120 మందికి పైగా పెట్టుబడిదారులు, 80 మందికి పైగా వక్తలు హాజరవుతారు. ఏఐ, రక్షణ, అంతరిక్ష సాంకేతికత, పెట్టుబడులు, క్విక్ కామర్స్, ఎస్ఎంఈ ఐపీఓలు వంటి రంగాలపై చర్చలు జరగనున్నాయి. మాస్టర్‌క్లాసులు, స్టార్టప్ ప్రదర్శనలు కూడా ఉంటాయి. తెలంగాణలోని 50 ప్రతిభావంతమైన…
In Hyderabad's LB Nagar police station limits, unidentified individuals set fire to two parked motorcycles in Sirinagar Colony, causing panic among locals. CCTV footage captured the suspects fleeing the scene.
హైదరాబాద్: మాదాపూర్‌లో తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి రేపు (నవంబర్ 11, 2026) సాయంత్రం ప్రారంభించనున్నారు. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవానికి హైడ్రా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తమ్మిడికుంట ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
ఇదే తమ్ముడికుంట చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్‌ను గతంలో హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే. రామంతాపూర్ పెద్ద చెరువు అభివృద్ధిలో గుడిసెలు కోల్పోయిన 34 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను సీఎం అందజేయనున్నారు.
వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి V6కు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరో 40 నుంచి 45 రోజుల వరకు మంజీరా, సింగూరు జలాలు నగరానికి వస్తాయని ఆయన చెప్పారు. సింగూరు మంజీరా జలాలు ఆగిపోతే నగరానికి 100MGDల నీటి గ్యాప్ ఉంటుందని, ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి ప్రత్యామ్నాయంగా గోదావరి నుంచి 40 MGD, కృష్ణా నుంచి 15 MGD, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి 5 ఎంజీడీల నీటిని తీసుకురాబోతున్నామని ఆయన చెప్పారు.
నవంబర్ 15 వరకు గోదావరి నుంచి 40MGDల అదనపు జలాలు హైదరాబాద్‌కి వస్తాయని తెలిపారు. కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పటాన్ చెరువుతో పాటు వెస్ట్ సిటీకి గోదావరి అదనపు జలాలను సప్లై చేస్తామని వాటర్ బోర్డ్ ఎండీ వివరించారు. వెస్ట్ సిటీలో 3 లక్షల నీటి కనెక్షన్లకు ప్రస్తుతం సింగూరు జలాలు అందిస్తున్నామని, నగరంలో ప్రతీ ఇంట్లో 20 శాతం నీటిని పొదుపు చేస్తే నీటి సమస్యే ఉండదని తెలిపారు.
హైదరాబాద్, వెలుగు: ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) హబ్‌గా హైదరాబాద్ జోరు కొనసాగిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ‘స్ప్లాష్ బీఐ’ తన నూతన జీసీసీ ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 515కు పైగా జీసీసీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వీటి ద్వారా దాదాపు మూడు లక్షల మందికి పైగా టెక్ నిపుణులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లోనే ప్రారంభం కావడం నగర సత్తాకు నిదర్శనమన్నారు. ఇదే ఊపును కొనసాగిస్తూ, వచ్చే ఏడాదిలో కొత్తగా మరో 100 జీసీసీలను హైదరాబాద్‌కు రప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని జీసీసీలను కేవలం సంప్రదాయ బ్యాక్ -ఆఫీస్ సేవలకు మాత్రమే పరిమితం చేయబోమని పేర్కొంటూ.. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల రూపకల్పన, ఉన్నత స్థాయి…
దీపావళి పండుగ వేళ భాగ్యనగరాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. సంబురంగా కాల్సిన పటాకుల నిప్పురవ్వలు పడి నగరవ్యాప్తంగా పదికి పైగా ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. పుత్లిబౌలిలో ఏసీలు, కంప్రెషర్లు బుగ్గి కాగా, చేవెళ్లలో పాత పట్వారీ ఆఫీసులో రికార్డులు కాలిపోయాయి. నాలుగైదు చోట్ల గోదాముల్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ముషీరాబాద్‌లో పది టూ వీటర్లు కాలిపోయాయి. ఓ చోట మెడికల్‌షాపు, ఇంకోచోట కిరాణా షాపు, రెండు చోట్ల పటాకుల షాపుల్లోనూ మంటలు చెలరేగాయి. అయితే, ఎక్కడా ప్రాణనష్టం జరగకలేదు.
గోషామహల్ : రాకెట్లు పేల్చడంతో తారాజువ్వలు రెండంతస్తుల బిల్డింగుపై పడి అఫ్జల్‌గంజ్ పీఎస్పరిధిలోని పుత్లిబౌలి చౌరస్తా సమీపంలోని ఓ బిల్డింగు గోదాంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రిఫ్రిజిరేటర్లు, ఏసీల కంప్రెసర్లు పేలిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. సమాచారం ఇచ్చిన అరగంట తర్వాత ఫైర్ వెహికల్రావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
హైదరాబాద్ సిటీ వెలుగు : దీపావళి వేళ హైదరాబాద్ నగరాన్ని వాయు, శబ్ధ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేసింది. టైమింగ్‌తో సంబంధం లేకుండా సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పటాకుల మోత మోగడంతో ఆ ప్రభావం తీవ్రంగా కనిపించింది. గాలి విషతుల్యమైపోయింది. మామూలు రోజుల్లో ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్60 నుంచి 76 వరకు ఉంటే పది నుంచి పదిహేను రెట్లు పెరిగి శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితిని తీసుకువచ్చింది. ఇక శబ్ధ కాలుష్యం కూడా అదే రేంజ్లో నమోదైంది. ఇంట్లో తలుపులు, కిటికీలు మూసుకుని ఉన్నా కూడా చెవులకు చిల్లులు పడే సౌండ్వచ్చింది. సాధారణంగా నివాస ప్రాంతాల్లో రాత్రి వేళ 45 డెసిబుల్స్ ఉండాల్సి ఉంటే ఈ దీపావళి రోజు…
పండుగకు ముందు వరకు సిటీలో ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్(వాయు నాణ్యత సూచీ) 60 నుంచి 76 మధ్య ఉండగా.. దీపావళి రాత్రి 9.30 గంటలకు 509కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఈ లెక్కలు మరీ దారుణ స్థితికి చేరుకున్నాయి. మసీద్‌బండ సమీపంలోని రవి కాలనీలో ఏక్యూఐ ఏకంగా 995గా నమోదైంది. ప్రకాశ్‌నగర్‌లో 828, కూకట్‌పల్లిలో 628, బిక్షపతినగర్లో 625, జనార్దన్ హిల్స్‌లో 532కి చేరింది. ఇక గాజులరామారంలో 487, ప్రగతి నగర్ లో 486, కేపీహెచ్‌బీ ఫేజ్ 1 లో 486గా నమోదైంది. 11.30 గంటలకు నగర సగటు 442గా నమోదైనా.. కాలుష్య తీవ్రత మాత్రం కొనసాగింది.
హైదరాబాద్ లో నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి అదనపు జలాల అను సంధాన పనులను ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని అధికారులకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. సింగూరు, మంజీరా జలాలు తగ్గుతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జలమండలి అధికారులు దృష్టి సారించారు.
హైదరాబాద్‌కు రోజుకు 40 ఎంజీడీల గోదావరి అదనపు జలాల తరలింపునకు చర్యలు తీసుకుంటున్నారు. ఘన్పూర్ వద్ద పైప్‌లైన్ అనుసంధాన పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. రెండు వైపుల నుంచి సమాంతరంగా పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటల పాటు నిరంతరాయంగా పనులు నిర్వహించాలని సూచించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.