We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్‌లో జరిగిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ ర్యాలీకి భారీగా తరలివెళ్లాయి. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఖమ్మం కమాన్ బజార్: దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థల పరిరక్షణకు కాంగ్రెస్ చేపట్టిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ హైదరాబాద్ ర్యాలీకి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ వద్ద డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గురువారం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలను, ఎన్నికల వ్యవస్థను బలహీనపరుస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. డా. బాబాసాహెబ్ అంబేడ్కర్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సైబరాబాద్ మూవ్స్ 2026 సదస్సులో మాట్లాడుతూ, హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త మార్పులు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ నగరానికి లష్కరే తోయిబా పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం సృష్టించింది. 26/11 తరహాలో దాడులు చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారని, నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారని ఈ కథనం తెలిపింది.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త మార్పులు చేపట్టే విషయంలో పోలీస్ సిబ్బందికి భరోసా ఇస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (నవంబర్ 26, 2026న) జరిగిన సైబరాబాద్ మూవ్స్ 2026 సదస్సులో పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో కంపెనీలు, ఉద్యోగాలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల రద్దీ విపరీతంగా పెరుగుతోందని డీజీపీ అన్నారు.
వేగంగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటోందని, హైదరాబాద్‌కు అలాంటి దుస్థితి రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు కారులో ఆఫీసుకు రావడాన్ని స్టేటస్ సింబల్‌గా భావించకుండా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (ప్రజా రవాణా) వినియోగించాలని సూచించారు. వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరానికి లష్కరే తోయిబా పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం సృష్టించింది. 26/11 తరహాలో దాడులు చేస్తామని ఆగంతుకులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేసి, పలు కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ నెల 18న జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో లష్కరే కమాండర్ లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు ఉంటాయని 21న పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రాణనష్టం కలిగిస్తామని హెచ్చరించారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. మెయిల్లో పేర్కొన్న ప్రదేశాలతో పాటు ఇతర రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో యాంటీ-సాబోటేజ్ తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
హైదరాబాద్: నగరంలో పలు చోట్ల 26/11 ముంబయి దాడుల తరహాలో బాంబులు పేలుతాయంటూ పోలీసులకు లష్కరే తయ్యిబా పేరుతో ఇటీవల బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాచిగూడ రైల్వే స్టేషన్, టూరిస్ట్ ప్లాజాలో బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, హోటళ్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, వదంతులు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
జమ్మూకశ్మీర్‌లో లష్కరే తయ్యిబా టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా దాడులు చేస్తామని నవంబర్ 21న బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తం చేశారు. లష్కరే తయ్యిబా పేరుతో మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రత పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వదిలి వెళ్లిన వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు సూచించారు. అన్ని భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
వచ్చే నెల 24 నాటికి పెసా చట్టం అమల్లోకి వచ్చి 30 ఏండ్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: గిరిజన సంస్కృతి, వారసత్వం, సంప్రదాయ హక్కులను చాటిచెప్పే జాతీయ స్థాయి ‘పెసా మహోత్సవ్’కు హైదరాబాద్ వేదిక కానుంది. పెసా చట్టం-1996 అమల్లోకి వచ్చి 30 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 24న పెసా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ వేడుకలు జరగనున్నాయి. ఐదో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్న తెలంగాణతో పాటు ఏపీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
కోల్‌బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: మందమర్రిలో ఏడు ఎకరాల్లో హైదరాబాద్‌తరహాలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మిస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో మంత్రి పర్యటించారు.
జైపూర్ మండలం గంగిపల్లి నుంచి ఎల్కంటి వరకు రూ.1.57కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ రోడ్డును, మందమర్రి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కొత్త రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈనాడు, హైదరాబాద్: అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ ఎవర్నెక్స్ తన భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. సర్వర్లు, స్టోరేజ్, నెట్వర్క్ పరికరాల నిర్వహణ, వాటి జీవితకాలం పెంపు, ఐటీ వ్యయాల తగ్గింపు కోసం సేవలు అందించనుంది. భారత్‌లో విస్తరణ ప్రారంభించిన తొలి ఏడాది నుంచి మూడో ఏడాదిలోగా ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఐటీ మౌలిక వసతుల మార్కెట్ తమకు వ్యూహాత్మకంగా కీలకమని సంస్థ వైస్ ప్రెసిడెంట్ స్మైల్ బహీదీన్ తెలిపారు. స్థానిక సిబ్బంది, నైపుణ్యాలపై పెట్టుబడులు పెట్టి వినియోగదారులకు మరింత చేరువవుతామన్నారు. హైదరాబాద్ వినియోగదారులు, భాగస్వామ్య సంస్థలకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్ సిటీలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన పరిష్కారమని ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ (TfL) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ సూచించారు. మెట్రో రైలు విస్తరణతో పాటు బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచాలని, ఫుట్‌పాత్‌లను వెడల్పు చేయాలని అభిప్రాయపడ్డారు. కేవలం రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతంపై బుధవారం (2026 నవంబర్ 25) హైదరాబాద్ మెట్రో రైల్ భవన్లో ప్రత్యేక చర్చాగోష్టి నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శశి వర్మ లండన్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలను వివరించారు.
హైదరాబాద్: మాదాపూర్ హైటెక్ సిటీ జంక్షన్ దగ్గర బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని సుష్మా చౌదరి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
కోతిలి అక్షయ్ కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న బుల్లెట్ బైక్‌పై సుష్మా చౌదరి ప్రయాణిస్తోంది. మాదాపూర్‌లోని తన స్నేహితుడు సందీప్ నివాసంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన అనంతరం, బుధవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో హైటెక్ సిటీ జంక్షన్ సమీపానికి చేరుకోగానే బైక్ అదుపు తప్పింది.
పెళ్లి ఊరేగింపులు, బరాత్ లలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు పోలీసులు. కత్తులతో, ఇతర మారణాయుధాలతో డ్యాన్స్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తే నిర్దాక్షిణ్యంగా కేసులు పెడతామని హెచ్చరించారు. రీసెంట్ గా హైదరాబాద్ లో కత్తులతో డ్యాన్స్ చేస్తూ నానా హంగామా సృష్టించిన నలుగురిపై కేసులు నమోదయిన విషయాన్ని వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహ బరాత్ ఊరేగింపులో కత్తులు ప్రదర్శించిన నలుగురు వ్యక్తులను 2026 నవంబర్ 25న అరెస్ట్ చేశారు. నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వివాహ బరాత్ ఊరేగింపు సందర్భంగా నలుగురు వ్యక్తులు కత్తులు చేతబట్టి, బహిరంగంగా ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుడిమల్కాపూర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.