Namasthe Telangana ·
Jio IPO | దద్దరిల్లిన జియో లిస్టింగ్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ
ముంబై, అక్టోబర్ 28 : ఆరంభం నుంచి రికార్డుల మోత మోగిస్తున్న జియో.. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో ఎగబడి కొన్న మదుపర్లు.. ఎక్కడా తగ్గలేదు మరి. ఉదయం మొదలు చివరిదాకా ఇంచుమించుగా కొనుగోలుకే పెద్దపీట వేశారు. ఇక ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ రావడంతో అటు బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)లలో జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ షేర్లు రూ.1,358 వద్ద నమోదయ్యాయి. గరిష్ఠ ఇష్యూ ధర రూ.1,119 కంటే ఇది 21.36 శాతం అధికం కావడం గమనార్హం. చివరికి బీఎస్ఈలో 26.66 శాతం వృద్ధితో రూ.1,417.35 వద్ద, ఎన్ఎస్ఈలో…
ఊహించినట్టుగానే భారతీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ జియో బంపర్ లిస్టింగ్ చేసింది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ రూ.13,05, 241.98 కోట్లకు చేరింది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్-10 బీఎస్ఈ నమోదిత సంస్థల్లో జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ రెండో స్థానంలో నిలిచింది. రూ.15,67,744.61 కోట్లతో తొలి స్థానంలో జియో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఉన్నది. కాగా, ఈ పబ్లిక్ ఇష్యూతో దేశీయ టెలికాం రంగంలో వినియోగదారులపరంగానేగాక, స్టాక్ మార్కెట్లలో విలువపరంగానూ జియో అగ్రగామిగా అవతరించింది. ఎయిర్టెల్ రెండో స్థానానికి పరిమితమైంది.