We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
The state government officially declared drought conditions across 365 mandals in 31 districts, classifying 111 as severely drought-affected and 254 as moderately affected.
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో 31 జిల్లాల పరిధిలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 111 మండలాలను ‘తీవ్ర కరువు’ ప్రాంతాలుగా, మరో 254 మండలాలను ‘మధ్యస్థ కరువు’ ప్రాంతాలుగా వర్గీకరించింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘నేషనల్ మాన్యువల్ ఫర్ డ్రాట్ మేనేజ్మెంట్’ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేసినట్లు సీఎస్ వెల్లడించారు. ఈ కరువు నోటిఫికేషన్ గెజిట్ విడుదలైన తేదీ నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అవసరమైతే మరిన్ని మండలాలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.
The Telangana state government declared a drought affecting 365 out of 365 mandals across 31 districts, attributing it to deficient rainfall, lack of irrigation infrastructure, and unannounced power cuts.
Drought | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలు, రాజకీయకక్ష సాధిం పు చర్యలు రాష్ర్టాన్ని కరువుకోరల్లోకి నెట్టాయి. నదీ జలాలను ఎత్తిపోయకుండా, కరెంటు ఇయ్యకుండా కరువును కొనితెచ్చి రైతు నెత్తిన పెట్టింది. రాష్ట్రంలో 365 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నట్టు ప్రకటిస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది. 33 జిల్లాలకుగాను 31 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రకటించింది. 65శాతం గ్రామీణం కరువుతో అల్లాడుతున్నదని ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో 111 మండలాల్లో తీవ్ర కరువు నెలకొనగా, మరో 254 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నదని పేర్కొన్నది.
వానాకాలం ఆరంభం నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వానకాలంలో వర్షపాతం 740.6 మిల్లీమీటర్లకుగాను 615.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనే కనీస ఆలోచన, బాధ్యత గానీ కాంగ్రెస్ సరార్లో కానరాలేదు. సాగునీటి శాఖను గాలికొదిలేసి కాలయాపన చేయడంతో దీని ప్రభావం సాగుపై పడింది. ఏకంగా 18 ప్రధాన వ్యవసాయ జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. నిరుటితో పోలిస్తే రాష్ట్రంలో 13.21లక్షల ఎకరాల్లో సాగు పూర్తిగా తగ్గిపోయింది. సాధారణంగా…
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రోజురోజుకూ వేడెక్కుతున్న వాతావరణంతో ఎల్ నినో పరిస్థితులు ప్రతి మూడు, నాలుగేండ్లకూ ఒకసారి వస్తుంటాయని, వాటివల్ల ఎదురయ్యే కరువు పరిస్థితులను ప్రభుత్వాలు బాధ్యతగా ఎదుర్కొని, ప్రజలను కాపాడాలని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కే పురుషోత్తమ్‌రెడ్డి హితవు చెప్పారు. కరువు పరిస్థితులు వచ్చాయనే సాకుతో రైతులను పంట సాగు చెయొద్దని చెప్పడం మూర్ఖత్వ చర్యగా అభిప్రాయపడ్డారు. కరువును ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ లోపమని పేర్కొన్నారు. శాశ్వతంగా కరువును జయించిన ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నాయని, వాటిని స్పూర్తిగా తీసుకొని రైతులను అప్రమత్తం…
పాలకులు, అధికారులు ఆ దిశగా ఆలోచించకుండా, రైతులను భయపెడుతూ పంటలు వేయొద్దని, క్రాప్‌హాలిడే ప్రకటించడం పిచ్చిచేష్టలని మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండి, వారిని రక్షించాలని, భయపెట్టి మరింత సంక్షోభంలోకి నెట్టేలా వ్యవహరించవద్దని సూచించారు. కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నివారణ శాఖ (ఎస్డీఎంఏ) అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. రైతులు కూడా సమైక్య స్ఫూర్తితో ప్రభుత్వాలపై ఎక్కువగా ఆధారపడకుండా గ్రామాలు వట్టివారిపల్లిని, మండలాలు ముల్కనూర్ను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తరాలకు మంచి జీవన విధానాన్నిచ్చేలా నడుచుకోవాలని సూచిస్తున్న ప్రముఖ పర్యావరణ…
హైదరాబాద్: తెలంగాణలో 365 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఎల్ నినో ప్రభావంతో ఈ కరువు మండలాల్లో దుర్భర పరిస్థితులు తలెత్తకుండా తాగునీటి సరఫరాతో పాటు పశుగ్రాసం, ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రాన్ని కరువు వేగంగా కమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మరోవైపు చలికాలంలోనూ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిమట్టాలు పడిపోతున్నాయి. భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి. దీంతో రాబోయే మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కరువు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
రామగిరి, అక్టోబర్ 27 : నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేద ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్.) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ.ఐ.కే.ఎం.ఎస్. ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై సమగ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం అనేది కేవలం పంటల సాగుకు మాత్రమే పరిమితం కాదని, దానిపై రైతుల కుటుంబాలతో పాటు వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ…
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 27 : ఆకాశం కరుణించడం లేదు. జలాశయాలు జలకళను కోల్పోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. మరోవైపు విద్యుత్ కోతలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎల్నీనో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ముదురుతుంటే, పంటలను కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగు సమయంలో అంచనాలకు మించి పంటలు వేసిన రైతులకు ఇప్పుడు చివరి తడులే గగనమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం.. పాలకుల ప్రణాళికా లోపం అన్నదాతకు శాపంగా మారుతున్నాయనే ఆవేదన వారినుంచి వ్యక్తమవుతున్నది.
సాగు చేశారు.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు! వానాకాలం ప్రారంభం నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా పంటలకు ఊపిరిపోసే వర్షాకాలమే ఈసారి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం 36–37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నేలలో తేమ వేగంగా తగ్గుతోంది. గంగాధర, కరీంనగర్ రూరల్, శంకరపట్నం, హుజూరాబాద్, చొప్పదండి, తదితర ప్రాంతాల్లో మరో 15–20 రోజుల్లో వరి కోతకు వచ్చే అవకాశమున్నా, అంతకుముందు అందించాల్సిన చివరి తడులే ప్రశ్నార్థకంగా మారాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఆరాటం అధికార యంత్రాంగానికి ఎందుకు…
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా రాష్ట్రంపైకి కరువును తెచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వరి వేయవద్దంటూ రైతులకు సుద్దులు చెప్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని, అన్ని వర్గాలనూ మోసం చేసిండని దుయ్యబట్టారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం అసెంబ్లీలో నిలదీస్తామని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ సోమవారం పర్యటించారు. మొదట గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తర్వాత సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్లో అంబా భవానీ మండపంలో పూజలు చేశారు. అనంతరం సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో రూ.30 లక్షల విలువైన అత్యవసర వైద్య సేవల పరికరాలను ప్రారంభించారు.
aకంచే చేనుమేస్తే అన్నట్టు.. కరువు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన సర్కారే చేజేతులా రాష్ర్టాన్ని కరువులోకి నెట్టివేస్తే? ఎండిపోయిన పొలాల సాక్షిగా నేడు తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది ఈ అసాధారణ చారిత్రక విషాదమే. సాగును సాగించలేని విపత్కర పరిస్థితులు వస్తే దిక్కుతోచని రైతులు సర్కార్‌కు సాయం కోసం మొరపెట్టుకుంటారు. కానీ ఇక్కడ సర్కారే దేహియని రైతుల సాయాన్ని అర్థించే విలోమ దృశ్యాన్ని చూడాల్సి వస్తున్నది. జలాశయాల్లో నుంచి నీరు దిగువకు జారిపోతుంటే చోద్యం చూసిన సర్కార్, నీళ్లు లేవు కనుక సాగునీరు అవసరమయ్యే వరిలాంటి పంటలు వేయొద్దని రైతులను వేడుకుంటున్న స్వరంలో హెచ్చరిస్తున్నది. కష్టాల్లో నుంచి బయటపడే దారి…
వరద వచ్చినప్పుడు నీటిని ఎత్తిపొయ్యని బురద రాజకీయం ఇవాళ మన రాష్ట్రం పాలిట శాపంగా మారింది. కరువును శాశ్వతంగా తరిమికొట్టేందుకు కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో కేసీఆర్ మహాజలసిరిని సంతరించి పెడితే, కల్లబొల్లి కబుర్లతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ చేతగాని, చేవలేని పాలనతో కృత్రిమ కరువును మన నెత్తిన తెచ్చిపెట్టింది. అసలు ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉన్నదో కూడా తెలియని అజ్ఞానులు కాళేశ్వరంపై విషం కక్కుతున్నారు. ఆ బృహత్తరమైన ప్రాజెక్టులో చిన్న కుంగుబాటు జరిగితే భూతద్దంలో చూపి హంగామా చేస్తారు. మొత్తం ప్రాజెక్టునే పండబెట్టి సాగును ఆగమాగం చేస్తారు. అసలింతకూ కన్నెపల్లి నుంచి నీటిని ఎక్కడికి…
Harish Rao | ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజులు 24 గంటలు నిరాటంకంగా పట్టిసీమ మోటార్ల ద్వారా నీళ్లెత్తిర్రు.. గోదావరి, కృష్ణా డెల్టాలను కాపాడుకున్నరు.. అని పత్రికల్లో చదివాం.
చంద్రబాబు నాయుడు 100 రోజులు పట్టిసీమ ద్వారా నీళ్లు ఎత్తి ఏపీకి కరువు లేకుండా చేశారు. మరి అదే గోదావరి నదిమీద పట్టిసీమ పైభాగంలో సమ్మక్క బ్యారేజ్ కట్టి, దేవాదుల ఫేజ్ 3 కూడా పూర్తి చేసి మీ చేతిలో పెట్టారు. మరి మీరు ఎన్ని రోజులు మోటార్లు నడిపారు. ఎన్ని గంటలు మోటార్లు నడిపారు.. ఎన్ని నీళ్లు ఎత్తారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మనం ఒడిసిపడితే కిందికి పట్టిసీమకు, ఆంధ్రాకు నీళ్లు పోనే పోవు కదా..మీరుఎత్తుకున్నంక మిగిలితేనే కిందికి పోవాలే. మరి 100 రోజులు 24 గంటలు పట్టిసీమ మోటార్లు నడిపి ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎత్తింది ఎట్లా..?
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.