We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
According to [PUBLISHER], the Chennai Super Kings (CSK) posted a cryptic video featuring new head coach Zaheer Khan and the team mascot Leo, sparking rumors about a potential trade for Hardik Pandya ahead of the IPL 2027 auction.
King 100 OTT Deal: నాగార్జున 100వ సినిమాకు భారీ ఓటీటీ డీల్? డిసెంబర్ 24న 'కింగ్ 100' రిలీజ్!
Entertainment — not analysed for political framing
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కింగ్ 100'. తన 100వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవాలని నాగార్జున భావిస్తున్నారు. ఆర్. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ డీల్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. 'కింగ్ 100' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ (SonyLIV) అన్ని భాషల కోసం భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, సినిమాను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్రమోషన్లపై దృష్టి పెట్టేందుకు రెడీ అవుతోంది.. అటు నాగార్జున 100వ సినిమా కావడంతో 'కింగ్ 100'పై ట్రేడ్ వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
Former Tamil Nadu Chief Minister MK Stalin criticized the ruling TVK government over a drug smuggling arrest and a mass jailbreak at Thenni Jail, using popular web series titles in his social media posts.
A netizen shared a video of a new car being vandalized overnight, with paint scratches discovered the next morning, which received widespread reactions on social media.
Hardik Pandya Trade: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్ వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పోస్ట్ చేసిన ఒక క్రిప్టిక్ వీడియో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై ఇండియన్స్ వీడి సీఎస్కే గూటికి చేరుతున్నాడనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈరోజు (2026, అక్టోబర్ 27, మంగళవారం) కొత్త హెడ్ కోచ్ జహీర్ ఖాన్ (Zaheer Khan), అసిస్టెంట్ కోచ్‌లు (ఆల్బీ మోర్కెల్, మోహిత్ శర్మ, గారెత్ బాటీ), జట్టు మాస్కాట్ 'లియో'లతో కూడిన వీడియోను చెన్నై విడుదల చేయగా, అందులో ఒక సీక్రెట్ హింట్ దాగి ఉండటం క్రికెట్…
ఐపీఎల్ 2027 కోసం చెన్నై సూపర్ కింగ్స్ భారీ ప్లాన్.. కొత్తగా ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌ల నియామకం
Not analysed for framing
IPL 2027: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ తమ సపోర్ట్ స్టాఫ్‌ను పూర్తిగా మార్చేస్తోంది. ఇటీవల న్యూ హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను (Zaheer Khan) నియమించిన సీఎస్కే, తాజాగా ముగ్గురు మాజీ క్రీడాకారులను అసిస్టెంట్ కోచ్‌లుగా నియమించుకున్నట్లు ప్రకటించింది. చెన్నై మాజీ స్టార్ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్ (Albie Morkel), భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ (Mohit Sharma), ఇంగ్లాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గారెత్ బాటీ (Gareth Batty) లు జహీర్ ఖాన్ నేతృత్వంలో సీఎస్కే అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.
ఇండియన్ టెలివిజన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు, నిర్మాత, ‘CID’ సిరీస్ సృష్టికర్త బీపీ సింగ్ (Brijendra Pal Singh) కన్నుమూశారు. 77 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణవార్తతో టెలివిజన్ రంగంలో విషాదం నెలకొంది. ‘CID’, ‘ఆహట్’ వంటి సూపర్‌హిట్ సిరీస్‌లతో ప్రేక్షకులకు చేరువైన బీపీ సింగ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
MK Stalin : తమిళనాడు (Tamil Nadu) లో జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) ప్రభుత్వానికి వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు డ్రగ్స్ అక్రమ రవాణాచేస్తూ పట్టుపడి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాడు. ఇప్పుడు తేనిలోని జైలు (Theni Jail) నుంచి ఖైదీలు పారిపోవడంతో ప్రభుత్వంపై విమర్శలపాలవుతోంది. వీటిపై మాజీ ముఖ్యమంత్రి (Ex CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్న ‘బ్రేకింగ్ బ్యాడ్ (Breaking Bad)’, ఇప్పుడు ‘ప్రిజన్ బ్రేక్ (Prison Break)’ అంటూ సోషల్ మీడియా (Social Media) లో పోస్టుపెట్టారు.
ప్రముఖ వెబ్ సిరీస్‌ల పేర్లతో రాష్ట్రంలోని శాంతి భద్రతలను పోల్చారు. తమిళనాడులో ‘బ్రేకింగ్ బ్యాడ్’ తర్వాత ‘ప్రిజన్ బ్రేక్’ మొదలైందని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం బెయిల్‌పై బయట ఉన్న నేరస్థులనే పర్యవేక్షించడం లేదనుకున్నానని, జైలులో ఉన్న ఖైదీలు తప్పించుకుంటున్నా చూస్తూ కూర్చుంటోందని ఇప్పుడు స్పష్టమైందని విమర్శించారు. ఇప్పటికే పుళల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన మరవకముందే ఇప్పుడు తేని జైలు నుంచి 17 మంది పారిపోయారన్నారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన 61వ జన్మదిన వేడుకలకు ముందే అభిమానులకు మైండ్ బ్లాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్' (King) నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రౌద్రరూప పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న 'కింగ్'లో షారుఖ్ ఖాన్ సరికొత్త, రఫ్ అండ్ రా అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో మండుతున్న నిప్పుల గుండం, చేతిలో గన్, రక్తంతో తడిసిన ఛాతీతో షారుఖ్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే... వెండితెరపై మాస్ విధ్వంసం ఖాయమనిపిస్తోంది. "ఆజ్ ఫిర్ యాద్ ఆయా... ఖాతిల్ నహీ... ఆషిక్ హూ..." అంటూ ఎస్ఆర్కే ఇచ్చిన క్యాప్షన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
Entertainment — not analysed for political framing
Shah Rukh | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ నుంచి మేకర్స్ తాజాగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ మరోసారి రొమాంటిక్ లవర్ బాయ్ లుక్‌లో కనిపించి అభిమానులను అలరించనున్నారు. తన 60 ఏళ్ల వయసులోనూ లవర్ బాయ్‌గా నటిస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.
“ఆజ్ ఫిర్ యాద్ ఆయా… కాతిల్ నహీ… ఆషిక్ హూ మే…” అంటూ షారుఖ్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో క్యాప్షన్ ఇస్తూ ఈ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Arjun Daughter Wedding: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చిన్న కుమార్తె పెళ్లి.. అంజనా వెడ్డింగ్ ఫొటోలు వైరల్
Not analysed for framing
సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లంటే అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. అందులోనూ ఓ స్టార్ హీరో ఇంట పెళ్లి వేడుక జరిగితే ఆ సందడే ప్రత్యేకం. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుటుంబంలోనూ ఇదే సందడి నెలకొంది. ఆయన చిన్న కుమార్తె అంజనా అర్జున్ తన చిరకాల ప్రేమికుడు ఇసాయ్ను పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 19న జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను అంజనా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ జంట వార్తల్లో నిలిచింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.