We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
రుణం తీసుకోవాలనుకునే వారికి క్రెడిట్ స్కోరు ఎంతో ముఖ్యం అని ఈ వ్యాసం వివరిస్తుంది. స్కోరు మెరుగ్గా ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు పెరగడంతోపాటు, తక్కువ వడ్డీ రేటు వర్తించే వీలుంటుంది అని తెలుపుతుంది.
రుణం తీసుకోవాలనుకునే వారికి క్రెడిట్ స్కోరు ఎంతో ముఖ్యం. స్కోరు మెరుగ్గా ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు పెరగడంతోపాటు, తక్కువ వడ్డీ రేటు వర్తించే వీలుంటుంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఎంతో కీలకం కానుంది. చెల్లింపుల్లో ఆలస్యం, క్రెడిట్ కార్డు బాకీలు పెరగడం, అవసరానికి మించి రుణాలు తీసుకోవడం స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కొన్ని ఆర్థిక వ్యూహాలను 30 రోజుల పాటు పాటించడం ద్వారా క్రెడిట్ స్కోరును గాడిన పెట్టొచ్చు.
క్రెడిట్ కార్డు బాకీ: క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం (మినిమం డ్యూ) మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వాయిదా వేయకూడదు. వీలైనంత వరకూ పూర్తి బిల్లును చెల్లించాలి. ఎందుకంటే మిగిలిన మొత్తంపై అధిక వడ్డీ పడుతుంది. అంతేకాకుండా, క్రెడిట్ పరిమితిలో ఎక్కువ మొత్తాన్ని వినియోగించడం వల్ల క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. ఇది స్కోరును ప్రభావితం చేస్తుంది. అందువల్ల కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడకుండా చూసుకోవడం మంచిది.
‘పన్నెండేళ్లు క్రెడిట్ కార్డు వాడలేదు’- ఈ మాట ఎవరన్నారో తెలుసా? నితిన్ కామత్! జెరోధా సహవ్యవస్థాపకుడు. ప్రారంభించిన కొద్దికాలంలోనే వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన బిలియనీర్. ఆయన ఓ సందర్భంలో గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆశ్చర్యపరిచే ఒక విషయం చెప్పారు. అదేంటంటే...
ఇరవై ఒక్కేళ్ల వయసులో క్రెడిట్ కార్డు మీద తీసుకున్న పాతిక వేల రూపాయల అప్పు తనకు జీవిత పాఠాన్ని నేర్పిందన్నారు నితిన్ కామత్. దాంతో పన్నెండేళ్ల పాటు ఆయన అసలు క్రెడిట్ కార్డునే వాడలేదట. జీమ్యాట్ పరీక్ష ఫీజు చెల్లించడానికి మొట్టమొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకున్నారు నితిన్. అప్పుడు ఆయన చేసిన ఖర్చు రూ.25వేలు మాత్రమే. నిజానికి ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేయలేదు కాబట్టి జీమ్యాట్ పరీక్ష కూడా రాయలేకపోయారు. దాంతో దానికోసం తీసుకున్న డబ్బు ఇతర అవసరాలకు ఖర్చు చేసేశారు. సరైన ఆదాయం లేకపోవడం, దానికి తోడు క్రెడిట్ కార్డు రుణాలపై పడే భారీ వడ్డీ రేట్లు తోడై పాతిక వేల అప్పును తీర్చడానికి ఆయనకు ఏకంగా…
న్యూఢిల్లీ : దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఈ ఏడాది డిసెంబర్లో క్రెడిట్ కార్డుల వ్యయాలు సుమారు రూ.2.45 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో డెబిట్ కార్డుల కొనుగోళ్లు రూ.40,492 కోట్లకు పరిమితం కావడం విశేషం. క్రెడిట్ కార్డు ఖర్చులు డెబిట్ కార్డు కొనుగోళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు అధికంగా నమోదయ్యాయి. అదే సమయంలో ఎటిఎంలు, పిఒఎస్ కేంద్రాల ద్వారా నగదు ఉపసంహరణలు రూ.2.33 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. క్రెడిట్ కార్డు ఖర్చుల్లో ఆన్లైన్ లావాదేవీల వాటా రూ.1.54 లక్షల కోట్లు కాగా, భౌతిక పిఒఎస్ కేంద్రాల వద్ద రూ.90,562 కోట్ల కొనుగోళ్లు జరిగాయి. డెబిట్ కార్డుల ద్వారా పిఒఎస్…
Credit card spends | దిల్లీ: క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డు, ఏటీఎం వినియోగానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది. అక్టోబర్ నెలలో డెబిట్ కార్డులతో పోలిస్తే క్రెడిట్ కార్డులతో (Credit card) ఆరు రెట్లు అధికంగా కొనుగోళ్లు జరిపినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఏటీఎం విత్‌డ్రాలు కూడా క్రెడిట్ కార్డుల స్థాయిలో నమోదు కావడం గమనార్హం. అంటే, ఓ వైపు డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నా.. క్యాష్కు ఆదరణ తగ్గడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఆన్లైన్ కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును అధిక సంఖ్యలో వినియోగిస్తుట్లు ఈ డేటా చెబుతోంది. డెబిట్ కార్డులను నగదు అవసరాల కోసం ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రాలకు మాత్రమే పరిమితం చేసినట్లు అర్థమవుతోంది. ఓ వైపు కార్డులు ఉపయోగించి చేస్తున్న లావాదేవీలు పెరుగుతున్నా.. నగదు ఉపసంహరణలూ అదే స్థాయిలో ఉన్నాయి. దీనిబట్టి రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో కార్డులతో సమానంగా నగదు కూడా కీలక పాత్ర పోషిస్తోందని అర్థమవుతోంది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.