We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
SEBI స్పందించి, IPOల గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ధరలను ప్రచురించడం మరియు ప్రచారం చేయడం ఆపాలని మధ్యవర్తులను మరియు మార్కెట్ వర్గాలను హెచ్చరించింది. అనధికారిక వెబ్సైట్లలో ప్రచురితమయ్యే ప్రీమియం ధరలు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సెబీ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఓల (IPOs) ప్రకటనల తర్వాత వాటి అంచనాలను పెంచే గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ధరలపై సెబీ (SEBI) స్పందించింది. జీఎంపీ ధరలను ప్రచురించడం, ప్రచారం చేయడం ఆపేయాలని మధ్యవర్తులను, మార్కెట్ వర్గాలను హెచ్చరించింది. అనధికారిక వెబ్సైట్లలో ప్రచురితమయ్యే ప్రీమియం ధరలు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సెబీ ఒక అడ్వైజరీ జారీ చేసింది.
ఐపీఓల ప్రకటన వెలువడిన నుంచి కంపెనీల షేర్లు లిస్టింగ్ అయ్యేవరకు కొన్ని బ్రోకరేజీ సంస్థలు జీఎంపీని ప్రచురిస్తుంటాయి. వీటికి ఎలాంటి అధికారిక ధృవీకరణా ఉండదు. అదేవిధంగా ఈ జీఎంపీ లావాదేవీల్లో పాల్గొనే ఇన్వెస్టర్లకు సెబీ నుంచి ఎలాంటి రక్షణ ఉండదు. కాబట్టి ఏదైనా మోసం జరిగినా ఫిర్యాదు చేసే అవకాశం లభించదు. ‘బ్రోకరేజీ కంపెనీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే జీఎంపీ ధరలను కొన్ని వెబ్సైట్లు, వార్తాపత్రికలు ప్రచురించడంతో ఇన్వెస్టర్ల అంచనాలు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు వారు అంచనా వేసినదానికంటే తక్కువ ధరకే షేర్లు లిస్టింగ్ కావడంతో పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది మార్కెట్ పారదర్శకతకు…
90వ దశకంలో భారతీయ మార్కెట్లో ప్రాచుర్యం పొందిన 'గోల్డ్ స్పాట్' కూల్ డ్రింక్ సుమారు 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి రాబోతోందని సమాచారం. కోకాకోలా ఈ డ్రింక్‌ను 'లో-షుగర్', 'నో-షుగర్' వేరియంట్లలో తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం వల్లే స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ దాడులు పెరగడానికి, అలాగే ఎన్నికలకు ముందు చమురు ధరలు ఆకాశాన్నంటడానికి డెమోక్రాట్ల విజయమే కారణమని ఆయన తన సోషల్ మీడియా వేదికపై పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంస్థ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. సీఈఓగా తిరిగి బాధ్యతలు చేపట్టిన అనంతరం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయానికి ఆయన (Jensen Huang) చేరుకున్నారు. ‘జెన్సన్.. జెన్సన్’ అంటూ నినాదాలు చేస్తూ ఉద్యోగులు ఆయనకు చప్పట్లతో స్వాగతం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ను నవంబర్ 23న సంస్థ బోర్డు తిరిగి అదే బాధ్యతల్లో నియమించింది. బోర్డు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. ‘‘నాకు రెండో అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సీఈఓగా మరింత మెరుగ్గా పనిచేసేందుకు ప్రయత్నిస్తాను. మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’’అని పేర్కొన్నారు. జెన్సన్ మాట్లాడుతోన్న సమయంలో ఓ మహిళా ఉద్యోగి ఆయనను కౌగిలించుకోవడంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
Stock market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరి..!
Not analysed for framing
Stock market : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్రమంగా నష్టాల్ల్లోకి జారుకున్నాయి. బ్యాంక్ షేర్లు, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడగొట్టాయి. దాంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1500 పాయింట్లు కోల్పోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ (Nifty) 450 పాయింట్లు పతనమై 25,400 దిగువకు పడిపోయింది.
ఇటీవల వరుసగా మార్కెట్లు రాణించిన వేళ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.508 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఇవాళ ఉదయం 84,421.97 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో 84,662.96 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది.
90వ దశకంలో భారతీయ మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన 'గోల్డ్ స్పాట్' కూల్ డ్రింక్ సుమారు 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. 'ది జింగ్ థింగ్' అనే ట్యాగ్‌లైన్‌తో ఒకప్పుడు పిల్లలు, యువతకు ఎంతో ఇష్టమైన ఈ ఆరెంజ్ ఫిజీ డ్రింక్ వచ్చే వారమే దుకాణాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
అయితే ఈసారి గోల్డ్ స్పాట్ సరికొత్త అవతారంలో రాబోతోంది. ప్రస్తుతం వినియోగదారులలో ఆరోగ్య స్పృహ పెరగడం, చక్కెర తక్కువగా ఉన్న డ్రింక్స్ కి డిమాండ్ ఉండటంతో.. ఈ డ్రింక్‌ను 'లో-షుగర్', 'నో-షుగర్' వేరియంట్లలో తీసుకువస్తోంది కోకాకోలా. తద్వారా కోకాకోలాకు చెందిన మరో ఆరెంజ్ డ్రింక్ 'ఫాంటా' అమ్మకాలపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి సోషల్ మీడియాలో గోల్డ్ స్పాట్ క్యాన్లతో కనిపించడం ఈ రీ-లాంచ్ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.
సోమవారం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. జనం పెట్టుబడులను ఎందుకు అమ్మేస్తున్నారు?
Not analysed for framing
సోమవారం ఉదయం లాభాలతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. గడచిన కొన్ని రోజులుగా అంతర్జాతీయ కారణాలతో పాటు ఏఐ షేర్లలో పెరిగిన అమ్మకాల ఒత్తిడితో ఆ డబ్బు అభివృద్ధి చెందుతున్న ఇండియన్ మార్కెట్లలో కూడా పార్క్ అయ్యింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటమే ప్రధాన కారణం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 629 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 196 పాయింట్లు నష్టంలో ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 1270 పాయింట్ల భారీ నష్టంలో కొనసాగుతుండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 403 పాయింట్లు నష్టంతో ముందుకు సాగుతోంది. సూచీలు ఓవర్‌బాట్ జోన్లో ఉండటం వల్ల మధ్యమధ్యలో ఇలాంటి ప్రాఫిట్ బుక్కింగ్స్, కన్సాలిడేషన్ సహజమని ఛాయిస్ బ్రోకింగ్ విశ్లేషకుడు హితేష్ టైలర్ పేర్కొన్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.