Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
SEBI: గ్రే మార్కెట్ ప్రీమియాలు పబ్లిష్ చేయొద్దు: సెబీ
By Eenadu1 min read at Eenadu
In brief
SEBI స్పందించి, IPOల గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ధరలను ప్రచురించడం మరియు ప్రచారం చేయడం ఆపాలని మధ్యవర్తులను మరియు మార్కెట్ వర్గాలను హెచ్చరించింది.
అనధికారిక వెబ్సైట్లలో ప్రచురితమయ్యే ప్రీమియం ధరలు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సెబీ పేర్కొంది.
ఈ మేరకు సెబీ ఒక అడ్వైజరీ జారీ చేసి, ఇన్వెస్టర్లకు జీఎంపీ ధరలను ప్రామాణికంగా తీసుకోవద్దని సూచించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఓల (IPOs) ప్రకటనల తర్వాత వాటి అంచనాలను పెంచే గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ధరలపై సెబీ (SEBI) స్పందించింది. జీఎంపీ ధరలను ప్రచురించడం, ప్రచారం చేయడం ఆపేయాలని మధ్యవర్తులను, మార్కెట్ వర్గాలను హెచ్చరించింది. అనధికారిక వెబ్సైట్లలో ప్రచురితమయ్యే ప్రీమియం ధరలు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సెబీ ఒక అడ్వైజరీ జారీ చేసింది.
ఐపీఓల ప్రకటన వెలువడిన నుంచి కంపెనీల షేర్లు లిస్టింగ్ అయ్యేవరకు కొన్ని బ్రోకరేజీ సంస్థలు జీఎంపీని ప్రచురిస్తుంటాయి. వీటికి ఎలాంటి అధికారిక ధృవీకరణా ఉండదు. అదేవిధంగా ఈ జీఎంపీ లావాదేవీల్లో పాల్గొనే ఇన్వెస్టర్లకు సెబీ నుంచి ఎలాంటి రక్షణ ఉండదు. కాబట్టి ఏదైనా మోసం జరిగినా ఫిర్యాదు చేసే అవకాశం లభించదు. ‘బ్రోకరేజీ కంపెనీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే జీఎంపీ ధరలను కొన్ని వెబ్సైట్లు, వార్తాపత్రికలు ప్రచురించడంతో ఇన్వెస్టర్ల అంచనాలు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు వారు అంచనా వేసినదానికంటే తక్కువ ధరకే షేర్లు లిస్టింగ్ కావడంతో పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది మార్కెట్ పారదర్శకతకు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)