We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
వర్ధన్నపేటలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలిసి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలోపెట్టుకొని చెక్‌డ్యామ్‌లు నిర్మించి రైతులను ఆదుకోవడంతో ఖరీఫ్‌లో మంచి దిగుబడి వచ్చిందని ఎమ్మెల్యే నాగరాజు చెప్పారు.
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలోపెట్టుకొని చెక్‌డ్యామ్‌లు నిర్మించి రైతులను ఆదుకోవడంతో ఖరీఫ్‌లో మంచి దిగుబడి వచ్చిందన్నారు. వరి ఎండిపోయిందని సోషల్ మీడియాలో కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడు ప్రభుత్వం మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపాన్ని వెలిగించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను తమిళనాడు హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ కమిషనర్ సమర్పించారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) 2025 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు 6,111 మంది భారతీయులను అరెస్టు చేసిందని అమెరికన్ కమ్యూనిటీ మీడియా నివేదిక పేర్కొంది. భారతీయులను డిపోర్టేషన్ కేంద్రాల్లో ఉంచి, కొందరిని భారత్‌కు వెనక్కి పంపినట్లు ఆ నివేదిక తెలిపింది.
Donald Trump | వాషింగ్టన్, నవంబర్ 22 : ఉద్యోగం కోసం.. వీసా భద్రత కోసం.. అమెరికాలోని సగటు భారతీయ టెకీ నిత్యం బతుకుపోరాటం చేస్తున్నాడు. నిరంతరం మారుతున్న నిబంధనలు, ఉద్యోగ కోతలు, గ్రీన్ కార్డు అనిశ్చితితో సతమతమవుతున్నాడు. ఉన్నత చదువును అభ్యసించినా చేతికి సంకెళ్లతో ఒక ఖైదీగా నిర్బంధ కేంద్రాల్లో మగ్గుతున్నాడు. వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోపిన ఉక్కుపాదం కింద వేలాది మంది భారతీయులు నలిగిపోతున్నారు. ఏ క్షణం ఏమవుతుందో, ఎప్పుడు అరెస్ట్ చేసి డిపోర్టేషన్ కేంద్రాలకు తరలిస్తారో, తమను దేశం నుంచి పంపేస్తారో అన్న భయంతో వేలాది మంది బిక్కుబిక్కుమంటున్నారు.
అమెరికన్ కమ్యూనిటీ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) 6,111 మంది భారతీయులను అరెస్టు చేసింది. అమెరికాలో భారతీయుల అరెస్టులకు సంబంధించి నమోదైన అత్యధిక సంఖ్య ఇదేనని నివేదిక పేర్కొన్నది. అరెస్టయిన వారిలో 5,235 మందిని డిపోర్టేషన్ కేంద్రాల్లో ఉంచగా, 2,349 మందిని భారత్‌కు వెనక్కి పంపారు. ఈ నెలలో జరిగిన మధ్యంతర ఎన్నికలకు ముందే ఐసీఈ దాడులను పెంచింది. ఆసియా-పసిఫిక్ వర్గంలో అరెస్టులు, నిర్బంధాలు, దేశబహిష్కరణలకు గురైన వారిలో భారతీయుల సంఖ్యే అధికంగా ఉందని స్టాప్ ఏఏపీఐ హేట్ సంస్థ తెలిపింది. దక్షిణాది రాష్ర్టాల్లో…
ఆమదాలవలస గ్రామీణం : సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, కూటమి బలపరిచిన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 24, 25 వార్డుల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Promotions | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ల విషయంలో కాం గ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీపీల ఆదాయాన్ని బట్టి కార్యదర్శుల క్యాడర్‌ను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఏప్రిల్ 15న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించిన నివేదికపై నేటికీ కదలిక లేక కార్యదర్శులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుతం కార్యదర్శుల క్యాడర్ విభజనలో ఉన్న విధానానికి బదులు జీపీ యూనిట్‌గా గ్రేడింగ్…
ఈ గ్రేడింగ్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12,760 పోస్టులను ప్రతిపాదించారు. గ్రేడ్-1లో 945, గ్రేడ్-2లో 1,258, గ్రేడ్-3లో 3,769, గ్రేడ్-4లో 6,788 పోస్టులు ఉండనున్నాయి. ప్రస్తుత క్యాడర్ నిర్మాణంలో మార్పులు చేసి, జీపీల ఆదాయానికి అనుగుణంగా కార్యదర్శుల హోదా నిర్ణయించనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే కార్యదర్శుల సర్వీసు వ్యవస్థలో మార్పులతోపాటు ప్రమోషన్లకు స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తయితే వివిధ గ్రేడ్లలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్త కార్యదర్శి పోస్టుల భర్తీకి కూడా మార్గం సుగమం కానున్నది. సుమారు 1,300 అదనపు కార్యదర్శి పోస్టులకు అవకాశం ఉంటుందని ఉద్యోగ వర్గాలు…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.