Andhra Jyothy ·
జీరో నక్సల్ స్టేట్‌గా తెలంగాణ: డీజీపీ ఆనంద్
Home » Telangana » Hyderabad » Telangana DGP CV Anand Highlights Crackdown on Drugs AND Cybercrime and Naxalism VK
ABN , Publish Date - Oct 23 , 2026 | 10:49 AM
Trending search
17 analysed of 19 matched articles · 5 outlets · checked 23 Oct 2026 17:48 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 17 analysed articles from 5 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
జీరో నక్సల్ స్టేట్‌గా తెలంగాణ: డీజీపీ ఆనంద్
Telangana DGP CV Anand commented that the state has become a 'zero naxal' state, highlighting the surrender of 824 naxals and the recovery of 302 weapons in the last two years during the 36th raising day parade of the Telangana Special Protection Force in Hyderabad.
Namasthe Telangana
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » Telangana DGP CV Anand Highlights Crackdown on Drugs AND Cybercrime and Naxalism VK
ABN , Publish Date - Oct 23 , 2026 | 10:49 AM
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » tgspf security services swathi lakra suchi
A. Brown Middle School in Portland. The event featured traditional Telugu attire, cultural performances, and the distribution of gifts and food to participants.
V6 Velugu
అర్బన్ ఫారెస్ట్ ల నిర్వహణలో తెలంగాణ ఆదర్శం.. సెల్ఫ్-సస్టెయిన్ మోడల్ పై కేంద్రం అధ్యయనం
The Government of Telangana is being studied by the Union Ministry of Environment, Forest and Climate Change for its self-sustaining model of maintaining urban forests across the state.
Eenadu
TG News: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సెలబ్రిటీలతో షార్ట్‌ఫిల్మ్‌లు: సీఎస్
The Chief Secretary of Telangana directed officials to organize cultural performances, celebrity short films, and extensive advertising for the upcoming Invest Telangana Global Summit.
Visalaandhra
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం - Visalaandhra
The Anantapur district police headquarters held a grand memorial day for police martyrs, led by IG Dr. Shemushi and SP P. Jagadish.
ABN , Publish Date - Oct 23 , 2026 | 09:55 AM
Andhra Jyothy ·
Home » Telangana » Southern States Police Coordination Meet in Hyderabad Today to Discuss Terrorism, Drugs and Cybercrime
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:37 AM
Namasthe Telangana ·
bathukamma celebrations | ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ నగరంలో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ , దసరా వేడుకలు అత్యంత వైభవంగా , కన్నుల పండుగగా జరిగాయి. R.A Brown Middle School లో జరిగిన ఈ వేడుకలను OTA ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకకి మహిళలు , చిన్నారి అమ్మాయిలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు.
మొదటి సారి పురుషులు, మహిళలు , పిల్లలు కోలాటం ఆట లో ఎంతో హుషారుగా పాల్గొన్న ఈ వేడుకలు అంబరాన్నంటాయి. బతుకమ్మ నిమజ్జనం తర్వాత మహిళలు అందరు గౌరమ్మ, ప్రసాదాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. దసరా ఉత్సవాన్ని షమీ స్తోత్రం అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ భలాయ్ చేసుకున్నారు. బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికీ రుచికరమైన భోజనాన్ని వడ్డించారు.
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: మహానగరాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు నగరాల్లో ఏటేటా ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నాయి. గదుల్లో ఏసీలు పెట్టుకుంటే నాలుగు గోడల మధ్య తాత్కాలిక ఉపశమనం దక్కుతుందే తప్ప, నగరాన్ని కూల్‌గా ఉంచలేవు. ప్రకృతి ప్రసాదించే సహజసిద్ధమైన అర్బన్ లంగ్ స్పేసెస్ (నగర వనాలు) మాత్రమే పట్టణంలో వేడి తీవ్రతను నియంత్రించగలవు.
ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం నగర్ వన్ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా నగర వనాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. కాగా, మొక్కలు నాటడం కంటే వాటిని ఏండ్ల తరబడి పచ్చగా కాపాడుకోవడంతోపాటు అర్బన్పార్కులను నిర్వహించడమే సవాల్‌గా మారింది. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర అటవీశాఖ అమలు చేస్తున్న నామమాత్రపు ప్రవేశ రుసుము (సెల్ఫ్-సస్టెయిన్ మోడల్) విధానం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు వ్యవహారంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోకుండానే, కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే 2 ప్రైవేట్ సంస్థలకు డీమ్డ్ వర్సిటీ హోదా కల్పిస్తూ యూజీసీ ఆదేశాలిచ్చింది.
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ యూజీసీ వ్యవహరించిన తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికితోడు స్టేట్ లో మరో 7 డీమ్డ్ వర్సిటీలకు పర్మిషన్ ఇచ్చేందుకు యూజీసీ సమాయత్తం అవుతున్నట్టు సమాచారం అందింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కాలరాయడంపై కేంద్ర విద్యాశాఖతో పాటు యూజీసీకి త్వరలోనే లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Jyothy ·
Home » NRI » Telangana Jagruthi celebrates Bathukamma Dasara and Alayi Balayi in Qatar pcs
ABN , Publish Date - Oct 22 , 2026 | 07:37 AM
Namasthe Telangana ·
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేటాయించిన తుంగభద్ర జలాలను కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తాగునీటి పేరుతో మన వాటా నీటిని కర్ణాటక మళ్లిస్తున్నదని, దీనిపై రేవంత్‌రెడ్డి ప్రభు త్వం తక్షణమే స్పందించి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాం డ్ చేశారు. బోర్డు షెడ్యూల్ ప్రకారం.. నీటిని విడుదల చేసినా, పది రోజులు గడిచినా రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు నీరు చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేశారు.
గతంలో 1,500 క్యూసెకులు విడుదల చేస్తే మూడు రోజుల్లోనే ఆర్డీఎస్కు చేరేవని, ఇప్పుడు వారం దాటినా రాకపోవడం ఆందోళనకరమని వాపోయారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కర్ణాటక తమ ఎగువ ప్రాంతాల్లోనే మళ్లిస్తున్నదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తుంగభద్ర బోర్డు, రాష్ట్ర నీటిపారుదల శాఖ వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రతిరోజూ విడుదలవుతున్న నీటి పరిమాణం, వినియోగం, ఆర్డీఎస్కు వాస్తవంగా చేరుతున్న నీటి లెకలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపి, కర్ణాటక ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు.
Eenadu ·
హైదరాబాద్: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్‌పై విస్తృత ప్రచారం చేయాలని, సమ్మిట్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
‘‘రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. అతిథులకు కళారూపాలతో ఘన స్వాగతం పలకాలి. ముగింపు వేడుకల్లో ప్రత్యేక కల్చరల్ కార్నివాల్ నిర్వహించాలి. సమ్మిట్‌పై ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలు, హోటళ్ల వద్ద హోర్డింగులు పెట్టాలి. సమ్మిట్ ప్రాధాన్యతపై సెలబ్రిటీలతో షార్ట్‌ఫిల్మ్‌లు తయారు చేయాలి’’అని సీఎస్ దిశానిర్దేశం చేశారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ 2.0ని నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Visalaandhra ·
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : సమాజ భద్రత, రక్షణల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని అనంతపురం రేంజ్ ఐజిపి డాక్టర్ షెముషి, జిల్లా ఎస్పీ పి.జగదీష్ సంయుక్తంగా పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సాయుధ బలగాల నుండీ ఐజిపి, ఎస్పీలు గౌరవ వందనం స్వీకరించి అనంతరం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతపురం రేంజ్ ఐజిపి డాక్టర్ షెముషి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో…
Namasthe Telangana ·
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వ అనుబంధ సంఘం టీడబ్ల్యూయూ గెలుపు కోసం చేసిన కుట్రలను తిప్పికొట్టిన ఆర్టీసీ కార్మికులు ఎంప్లాయిస్ యూనియన్‌కు భారీ విజయాన్ని అందించారు.
ఈ నెల 9న జరిగిన తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 34,421 ఓట్లు పోల్ అవ్వగా.. 18,276 ఓట్లు ఎంప్లాయీస్ యూనియన్ సాధించింది.ఎంప్లాయీస్ యూనియన్‌కు ఆర్టీసీ కార్మికులు భారీ మెజారిటీ కట్టబెట్టడంతో యూనియన్ నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
Eenadu ·
ఖమ్మం నేరవిభాగం : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లోని పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్, పోలీస్ కమిషనర్, పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరులను స్మరించుకుని రెండు…
జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ... దేశ రక్షణ కోసం లడక్ సరిహద్దు ప్రాంతంలో ప్రాణ త్యాగం చేసిన వీరుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ జెండా కేవలం ఒక వస్త్రం కాదని, అది పోలీస్ శాఖ నిత్యం ప్రదర్శించే నిబద్ధత, త్యాగం, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ప్రగతికి తోడుగా ప్రజలకు భరోసా, రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
V6 Velugu ·
హైదరాబాద్: తెలంగాణలో కొత్త పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2025 అక్టోబర్ నాటికే 16 వేల పోలీస్ ఉద్యోగాలు నియమించడం జరిగిందని, 2026లో మరో 7 వేల 437 పోస్టులు అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. 2028 నాటికి పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. మన కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని మనందరం స్మరించుకుందామని సీఎం పిలుపునిచ్చారు.
అక్టోబర్ 21న దేశ వ్యాప్తంగా పోలీసు అమరుల దినం జరుపుకుంటున్నామని.. 2026లో దేశ వ్యాప్తంగా 154 మంది విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజల రక్షణ కోసం వారు చేసిన త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని, అమరవీరులకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నానని సీఎం చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
V6 Velugu ·
తెలంగాణలో ఇవాళ (అక్టోబర్ 21), రేపు (అక్టోబర్ 22) వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక.. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
చెన్నైలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై సిటీలో నీటమునిగిన సాలిగ్రామం, టినగర్, వలసరవాకం, గిండి ప్రాంతాలు నీటమునిగిన పరిస్థితులున్నాయి.
Andhra Jyothy ·
Home » Telangana » Warangal » warangal khammam nalgonda mlc candidate suri
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:23 PM
Namasthe Telangana ·
KTR | తెలంగాణ ప్రజల అతిపెద్ద సాంస్కృతిక పండుగ అయిన దసరాను రాష్ట్ర ప్రజలందరూ అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను గుర్తుచేశారు.
తెలంగాణ జీవన విధానంలో దసరా పండుగకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో తీరిక లేకుండా ఉండే సొంతూళ్లకు వెళ్లి, చుట్టాలను, శ్రేయోభిలాషులను కలుసుకోవడం, బంధుమిత్రులందరూ ఒకచోట చేరి ఆప్యాయంగా ‘అలాయి-బలాయి’ చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. ఇక దసరా రోజున ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జమ్మి చెట్టుకు పూజలు చేయడం, తెలుగు సంప్రదాయంలో అత్యంత శుభప్రదంగా భావించే ‘పాలపిట్ట’ను దర్శించుకోవడానికి కుటుంబసమేతంగా వెళ్లడం మన ఆచారమని గుర్తుచేశారు.
Namasthe Telangana ·
Palapitta | ఒకప్పుడు పల్లెల్లో, పొలాల గట్లపై, చెట్ల కొమ్మల్లో, విద్యుత్తు తీగలపై విరివిగా కని పించే పాలపిట్ట సంతతి మారుతున్న పర్యావరణ పరిస్థితులతో క్రమంగా కనుమరుగవుతున్నది. దసరా పండుగ సమయంలో పాలపిట్టను చూడటం శుభప్రదమనే నమ్మకం ఉండటంతో ఈ పక్షికి తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నది. అందుకే బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దీనిని తెలంగాణ రాష్ట్ర పక్షిగా అధికారికంగా గుర్తించారు. అయితే గత దశాబ్దకాలంలో వీటిసంఖ్య గణ నీయంగా తగ్గినట్టు పక్షుల సర్వేలు వెల్లడిస్తున్నాయి.
పట్టణీకరణ, చెట్ల నరికివేత, వ్యవసాయంలో పురుగుమందుల అధిక వినియోగం, ఆవాసాల కొరత, అక్రమంగా పట్టుకోవడం, చైనా మాంజా వంటి అనేక ముప్పులు పాలపిట్టల మనుగడపై ప్రభావం చూపుతున్నాయి. పాలపిట్టలు సాధారణంగా పాత చెట్ల తొర్రలు,చెట్లలోని ఖాళీ ప్రదేశాల్లో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి చెట్లు తగ్గిపోవ డంతో సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రదే శాలు కూడా తగ్గుతున్నట్టు నిపుణులు గుర్తించారు. దసరా రోజు సాయంత్రం జమ్మి పూజ అనంతరం పాలపిట్టను చూస్తే విజయాలు, శుభాలు కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. అందుకే ఈ పక్షి తెలంగాణ సంస్కృ తిలో కేవలం ఒక పక్షిగా కాకుండా దసరా సంప్రదాయంలో భాగంగా మారింది. దసరా సందర్భంగా పాలపిట్టను…
V6 Velugu ·
శామీర్‌పేట్/ చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. జార్ఖండ్ కు చెందిన సుమిత్ కుల్లు (22), ఇతడి స్నేహితుడు కాస్మోస్ మార్కి (22) ఆదివారం తమ కంపెనీలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ముగిశాక బైక్‌పై బయటకు వెళ్లగా అలియాబాద్ బృంద కన్వెన్షన్ హాల్ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నాంచేరి గ్రామానికి చెందిన రైతు అలూరి కిష్టయ్య(42) బైక్‌పై ఆలూరుకు వెళ్తుండగా.. మరో బైక్ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కిష్టయ్య మృతిచెందగా.. మరొక వ్యక్తి మహిపాల్‌కు గాయాలయ్యాయి. అలాగే, శంకర్పల్లి మండలం సింగాపురానికి చెందిన బండారి మొగులయ్య (48) ఆదివారం రాత్రి బైక్‌పై సంగారెడ్డి వైపు వెళ్తున్నాడు. కంది బైపాస్‌లోని ల్యాంకో సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉన్న చోట బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతని తలపై నుంచి వెళ్లడంతో…
Andhra Jyothy ·
Home » Sports » para asian games telangana athlete deepti jeevanji wins gold 400m t20 srav
ABN , Publish Date - Oct 20 , 2026 | 07:28 AM
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.