We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నీటి ప్రాజెక్టులు, జీవోల విషయంలో చేసిన ఆరోపణలను ఖండించారు. పల్నాడు స్కీమ్ జీవో 56 గురించి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం అబద్ధమని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఉన్నప్పుడే 2022లోనే పల్నాడు స్కీమ్ జీవో 56 వచ్చిందని రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం పూర్తి అబద్ధం. ఆ జీవోలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామనే ప్రతిపాదన, ప్రస్తావనా ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే అది బయటపెట్టాలి.
ఉద్యమనేత కేసీఆర్ బయల్దేరితేనే అప్పుడు నాగార్జున సాగర్ కుడికాలువ లెక్కనే ఎడమ కాలువ నిర్వహణప్రభుత్వ నిధులతోనే చేపడుతామనే జీవో ఇచ్చిండ్రు.
10 వేల కోట్ల ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ వేదికగా ఈ క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్ జరగనుంది అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులు ఇకపై సెలవుల దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని IFMIS పోర్టల్‌లోని EHRMS మాడ్యూల్ ద్వారా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని జలసౌధ వేదికగా కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ నేతృత్వంలో త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఏపీ అధికారులు తమకు సమాచారం లేదని చెప్పగా, తెలంగాణ అధికారులు విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులకు కీలక మార్పు రానుంది.ఇకపై సెలవుల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇప్పటివరకు కొనసాగుతున్న మాన్యువల్ విధానానికి స్వస్తి పలుకుతూ, సెలవుల మంజూరు ప్రక్రియను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తమ సెలవుల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. వాటిని సంబంధిత అధికారులు కూడా ఆన్లైన్లోనే పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది.
IFMIS పోర్టల్‌లో EHRMS మాడ్యూల్ ద్వారా సేవలుఈ కొత్త విధానాన్ని ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (IFMIS) పోర్టల్‌లోని EHRMS మాడ్యూల్ ద్వారా అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.కేవలం సెలవుల దరఖాస్తులకే కాకుండా ఉద్యోగులకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన సర్వీసు వ్యవహారాలను కూడా ఇదే పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు.వార్షిక వేతన పెంపు (ఇంక్రిమెంట్లు), ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPGF) సంబంధిత పనులు, ఈ-పెన్షన్ (e-Pension) సేవలను కూడా EHRMS మాడ్యూల్ ద్వారానే ప్రాసెస్ చేయాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఏపీ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వాళ్లకే తెలియదట! ఇదీ త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌లో ఇటు కృష్ణా బోర్డుతో పాటు స్వయంగా ప్రాజెక్టునే కడుతున్న ఏపీ కూడా వింత సమాధానం చెప్పింది. సోమవారం జలసౌధ వేదికగా కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ నేతృత్వంలో త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. తాగు నీటి అవసరాల పేరిట మీటింగ్ పెట్టించిన పొరుగు రాష్ట్రాన్ని.. తెలంగాణ అధికారులు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కడిగిపారేశారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టును చేపడుతున్నారని, ఇటు తమకుగానీ, అటు బోర్డుకుగానీ కనీస…
అది రూరల్ వాటర్ సప్లై స్కీమ్ విభాగం వాళ్లు చేపడుతున్నారని, వాళ్లే జీవో ఇచ్చారని చెప్పారు. పత్రికల్లో చూస్తేనే తెలిసిందంటూ బోర్డు ముందు వాదించారు. ఇక్కడ ఒక్క చోటే కట్టడం లేదని, పలు రిజర్వాయర్లలోనూ పనులు జరుగుతున్నాయంటూ సమర్థించుకున్నారు. దానికి తెలంగాణ అధికారులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంత పెద్ద ఇంటర్ స్టేట్ ప్రాజెక్టులో నిర్మాణాలు జరుగుతున్నా ఇరిగేషన్ శాఖకు తెలియకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. అన్నీ తెలిసే చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుట్టు రట్టయ్యాక.. బట్టకాల్చి మీదెయ్యాలె! అడ్డంగా దొరికిపోయాక.. ఉల్టా బురదజల్లాలె! నీటిదొంగలకు సద్దులు కట్టిన విషయం బయటపడ్డాక.. నెపం మందిమీద వేయాలె! పచ్చి అబద్ధమని తెలిసినా పదే పదే అదే చెప్పాలె. వచ్చి మూడేండ్లయినా పాత ప్రభుత్వంపై పడి ఏడ్వాలె. ‘పల్నాడు జలధార’ విషయంలో అడ్డంగా దొరికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడదే చేస్తున్నది. సమైక్య పాలన నుంచి నేటిదాకా కృష్ణా నీటిని చెరపట్టే విషయంలో టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కు సుస్పష్టం. తెలుగుగంగ, పోతిరెడ్డిపాడు, పల్నాడు.. తాగునీటి అవసరాల ముసుగులో ఇద్దరూ కలిసి తెలంగాణ వెన్నులో దించిన ఖడ్గాలే.
ఏపీ చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం విషయం ఇప్పటివరకు మాకు తెలియదు. విషయం నా దృష్టికి రాగానే నాగార్జునసాగర్ ఈఈ మల్లికార్జున్ మీద సీరియస్ అయ్యాను.
‘ఈయనేం సీఎం అయ్యా.. నాలుగు మంచి మాటలు చెప్తే ఇందామని వచ్చినం…. నీళ్లు లేవు, కరువొచ్చింది అని చెప్తున్నడు.. యాసంగి పంట ఏసుకోవద్దని చెప్తున్నడు.. రైతులకు ఏమన్న సాయం గురించి చెప్తడేమోనని.. వచ్చినం. అవేం చెప్పలేదు. ఒక్కటే తిట్లు.. కేసీఆర్, కేటీఆర్‌ను, హరీశ్‌రావును తిట్టుడు తప్ప ఏం లేదు. ఛీఛీచీ.. మాట్లాడుడు మొదలు పెట్టినప్పటి నుంచి ఐపోయేదాక.. తిట్టుడు తప్ప ఏమున్నది. ఒక్క మంచి మాటన్న జెప్పిండా?’ అని సీఎం సిద్దిపేట సభకు హాజరైన వాళ్లు, మధ్యలోనే వెళ్లిపోతూ మాట్లాడుకున్న మాటలివి.
‘మా ఆడోళ్లకు ఇస్తమన్న ఇరవై ఐదు వందల రూపాయల గురించి ఏమన్న జెప్పుతడేమో అని జూసినం.. ఏం లేదు, వట్టి ఒర్రుడు తప్ప. ఏం ముచ్చట్నయ్యా ఈయనెది. ముఖ్యమంత్రి హోదాల వచ్చిండు.. మూడేండ్లల్ల ఏం చేసిండో చెప్పాలె.. ముంగట ఏం చేస్తడో చెప్పాలె. కానీ గిదేనా మాట్లాడే తరీఖ. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తి పొయ్యవయ్యా అంటే ఎత్తిపోస్తలేడు.. నీళ్లన్ని చంద్రబాబుకు ఇడిసి వెడ్తున్నడు.. ఒక్క మంచి పనన్న జేసిండా ఈయన.. ఈడికొచ్చి ఏందో లావు లావు మాట్లాడుతున్నడు’ ఈ మాటలన్నీ మొన్న సిద్దిపేటలో సీఎం మీటింగ్ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోతూ జనాలు మాట్లాడుకున్న మాటలు. ఆ విధంగా సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి షో అట్టర్ ఫ్లాప్ అయింది.…
కృష్ణా జలాల్లో తెలంగాణకు 578 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ( నవంబర్ 23 ) కేఆర్ఎంబీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో 578 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని.. ఒప్పందంలో ప్రతి ఏడాది మాట్లాడుకునే వెసలుబాటు ఉండేదని అన్నారు సీఎం రేవంత్.
కానీ.. 2020లో ఒకేసారి ఏపీకి 512 టీఎంసీల నీళ్లను తాకట్టు పెట్టారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల దోపిడీ ఆపే శక్తి లేకపోతే.. తెలంగాణ వచ్చాక కూడా ఎందుకు అడ్డుకోలేదని అన్నారు సీఎం రేవంత్.సాగర్ కు సొరంగం తవ్విన పాపం కేసీఆర్ దే అని.. కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని అన్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.