V6 Velugu ·
ఆకాశం నుంచి బుల్లెట్ల వర్షం.. భూమి పై జనం పరుగులు.. మెక్సికోలో రియల్ లైఫ్ ఆపరేషన్
ఆకాశం నుంచి బుల్లెట్ల వర్షం.. భూమి పై నుంచి కౌంటర్‌గా కాల్పులు.. ఏటు చూసినా తుపాకుల మోత.. అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక ప్రాణభయంతో ప్రజల పరుగులు.. ఇదేదో సినిమా కాదు. మెక్సికోలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, డ్రగ్ లార్డ్ ఫాస్టో ఇసిడ్రో మెజా-ఫ్లోర్స్‌ను అరెస్ట్ చేసేందుకు మెక్సికో సైన్యం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. శుక్రవారం రాత్రి (నవంబర్ 20) పశ్చిమ మెక్సికోలోని సినలోవా రాష్ట్రంలోని గ్వాసావే నగరంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన మెక్సికో ఆర్మీ డ్రగ్ కింగ్ పిన్ ఫాస్టో ఇసిడ్రో మెజా-ఫ్లోర్స్‌ను అరెస్ట్ చేసింది. సినిమాకు ఏ మాత్రం తీసిపోని హెలికాప్టర్ కాల్పులు, పేలుళ్లతో…
మెక్సికో డ్రగ్స్ సామాజ్ర్యానికి మెజా-ఫ్లోర్స్ కింగ్ పిన్. ఇతను లాస్ మజాట్లెకోస్ అనే గ్యాంగ్‌కు లీడర్. గతంలో బెల్ట్రాన్-లేవా కార్టెల్‌తో కలిసి పనిచేసిన ఇతను మెక్సికో, అమెరికాలోకి భారీ ఎత్తున డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. అండర్ గ్రౌండ్లో ఉండి వేలకోట్ల డ్రగ్స్ దందాను నడుపుతోన్న మెజా-ఫ్లోర్స్ అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఒకడు. ఇతని సమాచారం ఇచ్చిన వారికి అమెరికా ప్రభుత్వం గతంలో 5 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.