Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The Bharat Rashtra Samithi (BRS) issued a legal notice to the Velugu newspaper demanding an unconditional apology within 24 hours for publishing an article that linked Chief Minister K. Chandrashekar Rao's farmhouse to the Kondapochamma Sagar irrigation project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా వెలుగు దినపత్రిక కథనాన్ని ప్రచురించిందని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. అక్టోబర్ 17న మొదటి పేజీలో ప్రచురించిన ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని వెంటనే ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ వెలుగు యాజమాన్యానికి, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి అవసరాలు, కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన ఈ కథనానికి అధికారిక ఆధారాలేమిటని బీఆర్ఎస్ ప్రశ్నించింది. సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించారా? కాలువల వాస్తవ మార్గాలను ధ్రువీకరించారా? సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేకుండా సంచలనాత్మక శీర్షికలతో ఆరోపణలు ప్రచురించడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది.