Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ఐలు నల్లగొండ 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) నల్లగొండ జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని ఐలు జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.సతీష్ కుమార్, బి.అశోక్ కుమార్ న్యాయవాదులకు పిలుపునిచ్చారు.
ఈ నెల 28న నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో ఈ మహాసభలు నిర్వహించబడతాయి.
నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్ పటేల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
నీలగిరి, నవంబర్ 23 : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఐలు జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.సతీష్ కుమార్, బి.అశోక్ కుమార్ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో ఐలు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 28న నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించే ఐలు జిల్లా మహాసభలను న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్ పటేల్ హాజరవుతున్నట్లు తెలిపారు.
ఐలు యూనియన్ న్యాయవాదుల హక్కుల కోసం సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం పోరాడుతున్న సంఘమన్నారు. ఈ మహాసభలలో న్యాయవాదుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని, కావున సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు న్యాయ శాఖ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.స్వామిగౌడ్, సీనియర్ న్యాయవాదులు ఎన్.వి.రాఘవరావు, లెనిన్ బాబు, జి.జవహర్లాల్, నాగిరెడ్డి, ఎస్.ఆర్.ఠాగూర్, జి.లింగయ్య, టి.కిషోర్, డి.స్వామినాధ్, అప్రోజ్, భీమగాని గణేష్ శ్రీకాంత్, శంకర్ బాబు, వంశీకృష్ణ, రవీందర్రావు, బి.నాగేశ్ పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)