Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
By Eenadu2 min read at Eenadu
In brief
Andhra Pradesh DGP Harish Kumar Gupta stated that the polling for 92 urban local bodies across the state concluded peacefully, with minor incidents reported.
He emphasized that strict security measures, including advanced technology, were deployed, and warned that anyone disrupting the peace or the polling process will not be spared.
The article also reports on related incidents, including a minister visiting a student injured in a stabbing and peaceful polling in other districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన పోలింగ్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చిన ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారన్నారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, నిరంతర పర్యవేక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వివిధ శాఖల మధ్య సమన్వయం కారణంగా పోలింగ్ సజావుగా సాగిందన్నారు. పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ స్వయంగా పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. క్షేత్రస్థాయి పరిణామాలను ఎప్పటికప్పుడు…
కడప, కర్నూలు, అనంతపురం సహా మొత్తం 20 జిల్లాల నుంచి 41 ఎన్నికల సంబంధిత సంఘటనలకు సంబంధించి సమాచారం అందిందని డీజీపీ తెలిపారు. నమోదైన అన్ని ఫిర్యాదులను సమగ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ నిరంతరం పరిశీలిస్తోందన్నారు. ప్రతి సంఘటనకు సంబంధించి వాస్తవాలను క్షుణ్ణంగా ధ్రువీకరించాలని, బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించినట్లు డీజీపీ తెలిపారు. పోలింగ్ ప్రక్రియకు భంగం కలిగించేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని డీజీపీ స్పష్టం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)