Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Anganwadi Teacher | ఒక్కో అంగన్ వాడీ టీచర్ పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు..!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
స్థానికులు మరియు నిరుద్యోగ మహిళలు ఈ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పారదర్శకంగా ఎంపికలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు, కానీ ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Anganwadi Teacher | తొర్రూరు, నవంబర్ 21 : అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చర్చనీయాంశంగా మారాయి. నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించాల్సిన నియామక ప్రక్రియలో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒక్కో అంగన్వాడీ టీచర్ పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది.
తొర్రూరు మండల పరిధిలో మొత్తం 29 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి రాగా.. వీటి కోసం ఏకంగా 462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే ఒక్కో పోస్టుకు సుమారు 16 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఎంతోమంది నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు అభ్యర్థుల నుంచి ముందస్తుగానే డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)