Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Artificial Intelligence: ఎంఎస్ఎంఈలకు అండగా ఏఐ... అందిపుచ్చుకోవడమే ఆలస్యం
By Eenadu3 min read at Eenadu
In brief
ఒక అధ్యయనం ప్రకారం, అవగాహన లేకపోవడం, ఆర్థిక వనరులు మరియు సాంకేతిక నైపుణ్యాల కొరత కారణంగా ఎంఎస్ఎంఈలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడుతున్నాయని తేలింది.
చిన్నసంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చో వివరిస్తూ, ఏఐ సాధనాలను వాడేటప్పుడు మానవ ప్రమేయం మరియు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని పాటించడం మంచిదని సూచించారు.
ఏఐ వినియోగం విషయంలో చిన్నగా మొదలుపెట్టి, డేటాను నిర్మించుకుంటూ, సిబ్బందికి శిక్షణ ఇస్తూ, మానవ విచక్షణను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కృత్రిమ మేధ(ఏఐ) నేడు అన్ని రంగాలకూ శరవేగంగా విస్తరిస్తోంది. దేశార్థిక వ్యవస్థకు జీవనాడి వంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకూ సవాలు విసురుతోంది. అవగాహన లేకపోవడానికి తోడు ఆర్థిక వనరులు, సాంకేతిక నైపుణ్యాల కొరత వల్ల ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎంఎస్ఎంఈలు వెనకబడుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో చిన్నసంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది.
ఏఐ తొలి దశ ఎంఎస్ఎంఈలకు అందుబాటులో లేకపోయినా జెనరేటివ్ ఏఐ(జెన్ఏఐ), ఏజెంటిక్ ఏఐలు పరిస్థితిలో మార్పు తెస్తున్నాయి. చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాధనాలు సమాచారాన్ని, చిత్రాలను సృష్టించడంలోనూ, క్లాడ్ ఏజెంట్స్ వంటి ఏజెంటిక్ ఏఐ సాధనాలు రిమైండర్లు పంపడం, రికార్డులను నవీకరించడం వంటి పనుల్లో సాయపడతాయి. ఈ రెండు రకాల ఏఐ సాధనాలను ఉచితంగా పరీక్షించుకునే అవకాశం ఉంది. అలాగే, లైసెన్స్‌తో కూడిన వాడకానికి నెలకు రూ.400 నుంచి తగిన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)