Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అరుణాచల్ లో ఇండో, చైనా కమాండర్ల మీటింగ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
న్యూఢిల్లీలో చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని వివాదాస్పద సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనాలు ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిపాయి.
భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియా నాయకత్వం వహించగా, భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఈ భేటీలో పాల్గొన్నారు.
స్థానిక వివాదాలు భారీ సైనిక ప్రతిష్టంభనకు దారితీయకుండా అడ్డుకోవడంపై ఈ చర్చల్లో దృష్టి సారించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
న్యూఢిల్లీ: చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని వివాదాస్పద సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను తగ్గించి, సైనికుల మధ్య ఘర్షణలను నివారించేందుకు భారత్, చైనాలు తాజాగా మరో విడత ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిపాయి. నాగాలాండ్‌లోని దిమాపూర్ కేంద్రంగా పనిచేసే భారత సైన్యానికి చెందిన 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియా భారత బృందానికి నాయకత్వం వహించారు.
భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఈ భేటీలో పాల్గొన్నారు. గస్తీ దళాల మధ్య ఘర్షణలను నివారించేందుకు స్పష్టమైన నియమ నిబంధనలను రూపొందించడం, సమాచార మార్పిడిని నిరంతరం కొనసాగించడం, స్థానిక వివాదాలు భారీ సైనిక ప్రతిష్టంభనకు దారితీయకుండా అడ్డుకోవడంపై ఈ చర్చల్లో దృష్టి సారించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు ప్రాంతాల్లో ఇరు దేశాల దళాలు ఎదురుపడుతుండటంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుపక్షాలు భారీగా బలగాలను మోహరించగా, రాబోయే తీవ్రమైన చలికాలం ఈ పర్వత ప్రాంతంలో సైనిక కార్యకలాపాలకు మరిన్ని సవాళ్లను విసరనుంది.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)