Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
భీమవరంలో పొత్తు లేకుండానే పోటీ: శ్రీనివాసవర్మ
By Eenadu1 min read at Eenadu
In brief
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అసహనం వ్యక్తం చేశారు.
ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, పొత్తుతో సంబంధం లేకుండా అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని చెప్పారు.
భాజపాకు సమాచారం ఇవ్వకుండానే తెదేపా, జనసేన నాయకులు అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు డిజిటల్, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ పొత్తుతో సంబంధం లేకుండా అన్ని వార్డుల్లో పోటీ చేస్తామన్నారు. భీమవరంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. భాజపాకు ఏ వార్డులు కేటాయించారో సమాచారం ఇవ్వకుండానే తెదేపా, జనసేన నాయకులు అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భీమవరంలో 52 వార్డులు ఉండగా.. తమకు ఐదు సీట్లు ఇస్తామని నిర్ణయించడం, ఎంపీ పాకా సత్యనారాయణ తనయుడికి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించడం భాజపాను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. తమకు కేటాయించిన ఐదు వార్డుల్లో రెండు చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా.. మిగిలిన మూడు స్థానాలపై భాజపా నిర్ణయం తీసుకోకుండానే తెదేపా, జనసేనలు చెరో 24 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)