Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bird Flu Vaccine: అందుబాటులోకి.. స్వదేశీ బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్
By Eenadu1 min read at Eenadu
In brief
దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
దీనిని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భోపాల్‌లో ఆవిష్కరించారు.
ఈ టీకాను ఐసీఏఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ అభివృద్ధి చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: బర్డ్ ఫ్లూ (Bird Flu) బారిన పడకుండా పౌల్ట్రీ రంగాన్ని కాపాడేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్5ఎన్1 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భోపాల్‌లో ఆవిష్కరించారు. భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేశాయి. అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ)లోని క్లేడ్ 2.3.2.1aకు చెందిన హెచ్5ఎన్1 వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి టీకా (Bird Flu Vaccine) ఇదేనని అధికారులు పేర్కొన్నారు.
బర్డ్ ఫ్లూగా ప్రసిద్ధమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అతి త్వరితంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన వ్యాధి. కోళ్లు, పక్షులపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. దీని కారణంగా అనేక రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక నష్టాలను చవిచూసింది. ఈ క్రమంలోనే దేశీయ టీకా కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. పౌల్ట్రీ రంగాన్ని పరిరక్షించడంతోపాటు, కోళ్ల పెంపకందారుల జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగు అని అన్నారు. ఇందుకోసం కృషి చేసిన శాస్త్రవేత్తలు, పరిశోధకులందరికీ అభినందనలు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)