Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
BJP MLA Rekha Patra: వెంటిలేటర్‌పై భాజపా ఎమ్మెల్యే.. శరీరంలో పురుగుల మందు ఆనవాళ్లు
By Eenadu2 min read at Eenadu
In brief
పశ్చిమబెంగాల్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే రేఖా పాత్రా కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
ఆమె శరీరంలో పురుగుల మందు ఆనవాళ్లు ఉన్నట్లు మెడికల్ రిపోర్టుల్లో తేలడంతో విషప్రయోగం జరిగి ఉండొచ్చని పోలీసులు ఆరా తీస్తున్నారు.
పశ్చిమబెంగాల్ ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, కలుషిత ఆహారం తినడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని మీడియాతో చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Bengal)భాజపా ఎమ్మెల్యే రేఖా పాత్రా (BJP MLA Rekha Patra) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం కోల్‌కతాలోని (Kolkata) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. తొలుత ఆహారం వికటించడంతో ఆమె అస్వస్థతకు గురైనట్లు భావించినా.. మెడికల్ రిపోర్టుల్లో పురుగుల మందు ఆనవాళ్లు ఉన్నట్లు బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
రేఖా పాత్రా శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తొలుత స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బసిర్హత్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యుల సూచనమేరకు ఇవాళ కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా క్రిమిసంహారక మందు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆమె శరీరంలోకి పురుగుల మందు ఎలా వెళ్లిందన్న దానిపై స్పష్టత లేదు. ఎవరైనా చేసి ఉంటారా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)