Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chhattisgarh Elephant: ఏనుగు బీభత్సం.. ఏడు నెలల్లో 16 మందిని తొక్కిచంపి
By Eenadu1 min read at Eenadu
In brief
According to forest officials, a rogue elephant known as 'Kabra Kan' has killed 16 people in the Surguja and Surajpur districts of Chhattisgarh over the past 6-7 months.
Authorities have received permission to tranquilize, capture, and fit the radio-collar the elephant to track its movements and prevent future attacks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్గఢ్లో ఓ ఏనుగు హడలెత్తిస్తోంది. సూరజ్పుర్ జిల్లాలో తాజాగా ఈ గజరాజు దాడిలో ఓ మహిళ (45) ప్రాణాలు కోల్పోయింది. దీంతో కలుపుకొని సూరజ్పుర్, బల్రామ్పుర్ జిల్లాల్లో గత 6-7 నెలల వ్యవధిలో ఈ ఏనుగు 16 మందిని తొక్కిచంపిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్థానికులు ‘కబ్రా కాన్’గా పిలుచుకునే ఈ ఒంటరి గజరాజుకు రేడియో కాలర్ అమర్చేందుకు ఉన్నతాధికారులు తాజాగా అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఏనుగు సర్గుజా జిల్లాలోని ఉదయపుర్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిందని, దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
ప్రతాప్పుర్, సూరజ్పుర్, రాజ్పుర్, తామోర్ పింగ్లా తదితర రేంజ్ల పరిధిలో ఈ ఏనుగు సంచరిస్తూ ప్రాణ, ఆస్తినష్టానికి పాల్పడుతోందని అధికారులు తెలిపారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతించారని.. దాని కదలికలను ట్రాక్ చేసేందుకు, భవిష్యత్తులో దాడులను నివారించేందుకు నాలుగు రోజుల్లో శాటిలైట్ రేడియో కాలర్ అమర్చుతామని చెప్పారు. ఆ సమయంలో అవసరమైతే శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతామన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)