Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Congress Donations: 75% తగ్గిన కాంగ్రెస్ విరాళాలు.. పదేళ్లలో ఇదే భారీ పతనం
By Eenadu2 min read at Eenadu
In brief
Congress reported a 75% drop in donations to ₹130.69 crores in the 2025-26 financial year compared to ₹517.39 crores in 2024-25.
The Election Commission of India received the report from AICC Treasurer Ajay Maken, which attributed the decline to a significant drop in funds from the Prudent Electoral Trust.
The article also notes that the BJP received ₹6,074.02 crores in 2024-25, with its 2025-26 report yet to be disclosed, and excludes other income sources like coupons and membership fees.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.130.69 కోట్ల విరాళాలు అందిన విషయం తెలిసిందే. అయితే, 2024-25లో సమకూరిన రూ.517.39 కోట్లతో పోలిస్తే 2025-26లో విరాళాలు ఏకంగా 75 శాతం మేర పడిపోవడం గమనార్హం. గత దశాబ్ద కాలంలో నమోదైన అత్యంత భారీ తగ్గుదల ఇదే. గత 12 ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూస్తే.. అంతకుముందు 2015-16లో అత్యంత భారీ తగ్గుదల నమోదైంది. ఆ ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ (Congress)కు అందిన విరాళాలు.. అంతకుముందు ఏడాదిలో అందిన రూ.141.46 కోట్లతో పోలిస్తే సుమారు 86 శాతం తగ్గిపోయాయి.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29(సి) కింద అన్ని రాజకీయ పార్టీలు తమకు అందిన రూ.20 వేలకు మించిన విరాళాల వివరాలను ఏటా ఎన్నికల సంఘానికి (Election Commission) సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగా నివేదికను ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకన్ ఈసీకి సమర్పించారు. 2025-26లో కాంగ్రెస్ విరాళాల మొత్తం పడిపోవడానికి.. ‘ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్’ ద్వారా అందే సాయం తగ్గిపోవడమే ప్రధాన కారణం. 2024-25లో ఈ ట్రస్ట్ ద్వారా రూ.216.34 కోట్లు అందగా.. 2025-26లో అది సుమారు 88 శాతం తగ్గిపోయి రూ.25 కోట్లకు పడిపోయింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)