Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం రెడీ.. ముసాయిదా సిద్ధం
By Eenadu2 min read at Eenadu
In brief
కేంద్ర ప్రభుత్వం పాత డీలిమిటేషన్ బిల్లును ఉపసంహరించుకుని కొత్త డీలిమిటేషన్ బిల్లు - 2026ను తీసుకురానుంది.
లోక్‌సభ, అసెంబ్లీల్లో 50 శాతం సీట్లు పెంచేలా, అలాగే మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసేలా ఈ ముసాయిదాను కేంద్రం రూపొందించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత బిల్లు స్థానంలో కొత్త డీలిమిటేషన్ బిల్లు - 2026ను తీసుకురానుంది. మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు 132వ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో 50 శాతం సీట్లు పెంచేలా కొత్త బిల్లులో నిబంధనను పొందుపర్చింది. డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లును ఈ నెల 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కొత్త బిల్లు కాపీని ఎంపీలకు పంపించిన కేంద్రం.. పార్లమెంట్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచింది.
ఆర్టికల్ 334-ఏ కింద మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేసేలా ఈ బిల్లును కేంద్రం తీసుకురానుంది. చట్టసభల్లో 50 శాతం సీట్లు పెరిగేలా ప్రతిపాదనను ముసాయిదాలో పొందుపర్చింది. అంతే కాకుండా ఈ బిల్లు ద్వారా రాష్ట్రాల మధ్య ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మార్పుల ద్వారా లోక్‌సభతో పాటు రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో సీట్లు కూడా 50 శాతానికి పెరిగేలా ప్రతిపాదనలు చేసింది. లోక్‌సభ సీట్లు గరిష్ఠంగా 850కి, అసెంబ్లీల సీట్లు గరిష్ఠంగా 650కి పెంచుతూ ముసాయిదాలో ప్రతిపాదన చేసింది. యూపీ అసెంబ్లీలో సీట్లు 403 నుంచి 650కి పెరిగే అవకాశం ఉంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)