Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Parliament Session: కీలక బిల్లులే లక్ష్యంగా.. 30 నుంచి లోక్సభ ప్రారంభం
By Eenadu1 min read at Eenadu
In brief
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30 నుంచి లోక్సభ, డిసెంబర్ 3 నుంచి రాజ్యసభను పునః ప్రారంభించాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్లకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్లు, లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణకు ఉద్దేశించిన డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదమే లక్ష్యంగా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడం ప్రభుత్వానికి సవాలే అయినప్పటికీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్లు, లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణకు ఉద్దేశించిన (Delimitation) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదమే లక్ష్యంగా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 30 నుంచి లోక్సభ, డిసెంబర్ 3 నుంచి రాజ్యసభను పునః ప్రారంభించాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్లకు విజ్ఞప్తి చేసినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. డిసెంబర్ 3నే ఉభయ సభలు ముగించే అవకాశం ఉందన్నారు. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఏ బిల్లులను ప్రవేశపెడతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు.. డీలిమిటేషన్ ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే, లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మెజార్టీని సాధించడం ప్రభుత్వానికి సవాలే అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)