Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడి యువకుడు మృతి
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
A young man named Vakatani Veerababu died after falling from his two-wheeler on the Jamalapuram road curve in Khammam district.
The accident occurred early Wednesday morning, and the police have registered a case and initiated an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎర్రుపాలెం: ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం రహదారి మలుపు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లపాలెం గ్రామానికి చెందిన వాకదాని వీరబాబు(24) స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గంమధ్యలో జమలాపురం మలుపు వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పైనుంచి జారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)