Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణలో ఆర్ట్స్ విద్యార్థుల ప్రతిభ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ఎంసీఏ విద్యార్థులు ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్నారు.
అనుదీప్ ఫౌండేషన్, ఎస్ ఫౌండేషన్ సహకారంతో జనవరి నుంచి మార్చి వరకు హనుమకొండలోని అనుదీప్ ఫౌండేషన్ స్కిల్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ శిక్షణను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 135 గంటల పాటు శిక్షణ అందించగా, ఎడెలా శివాజీ గ్రేడ్-ఏ సాధించి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ పొందారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి) ఎంసీఏ విద్యార్థులు ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్లు అందుకున్నారు. అనుదీప్ ఫౌండేషన్, ఎస్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ‘కస్టమర్ సేల్స్ అండ్ సర్వీస్ విత్ ఏఐ’అనే శిక్షణ కార్యక్రమాన్ని జనవరి నుంచి మార్చి వరకు హనుమకొండలోని అనుదీప్ ఫౌండేషన్ స్కిల్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 135 గంటల పాటు శిక్షణ అందించారు.
ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఎడెలా శివాజీ గ్రేడ్-ఏ సాధించి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ పొందారు. అలాగే కళాశాలకు చెందిన ఎంసీఏ విద్యార్థులు మేఘన, ప్రేమ్ కుమార్, రంజిత్, సాధిక, ఉష, అపర్ణ, అనూషలు కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.జ్యోతి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎం.రెహమాన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎల్.జితేందర్ పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)