Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Modern Ikra School in Ramavaram Subhash Chandra Bose Nagar, Kothagudem, organized an awareness session on e-waste pollution for students.
Correspondent Abdul Basith called upon everyone to contribute to environmental conservation, highlighting that electronic waste harms the earth, water, and air.
The event included poster, painting, and essay competitions, followed by a rally to educate locals on e-waste management.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రుద్రంపూర్, అక్టోబర్ 27 : ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోడ్రన్ ఇఖ్రా పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 12వ వార్డు రామవరం సుభాష్ చంద్రబోస్ నగర్లో ఉన్న మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఈ-వ్యర్థాల వల్ల కలిగే నష్టాలపై పోస్టర్, పెయింటింగ్, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను అవసరం లేకుండా తరచూ మార్చడం వల్ల ఈ-వ్యర్థాలు…
ఈ-వ్యర్థాల్లోని హానికర పదార్థాలు భూమి, నీరు, గాలిని కలుషితం చేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని వివరించారు. భవిష్యత్ తరాలకు కలుషితం లేని గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చని చెట్లతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల పరిసరాల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, స్థానికులకు ఈ-వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు ప్రసన్న, నాజియా, సరస్వతి, నుస్రత్, సల్మా జాఫర్, ఖాజాతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)

