Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కోటిన్నర ఇస్తా..
By Eenadu1 min read at Eenadu
In brief
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం చందకచర్ల సర్పంచి పదవికి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీకి రూ.1.50 కోట్లు జమ చేస్తానని భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయస్వామీజీ ప్రకటించారు.
గ్రామస్థుల అభ్యర్థన మేరకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని తెదేపా, వైకాపా ఇతర పార్టీల నేతలను కలిసి మద్దతు కోరతానని స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయ స్వామీజీ
మడకశిర, న్యూస్టుడే: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం చందకచర్ల సర్పంచి పదవికి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీకి రూ.1.50కోట్లు జమ చేస్తానని భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయస్వామీజీ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు శనివారం మీడియా ఎదుట వెల్లడించారు. చందకచర్ల తన స్వగ్రామమని, గ్రామస్థుల అభ్యర్థన మేరకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని తెదేపా, వైకాపా ఇతర పార్టీల నేతలను కలిసి మద్దతు కోరతానని స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇస్తే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)