Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Election Expenditure | ఎన్నికల ఖర్చులపై కొత్త వివాదం.. రూ.90 కోట్లు చెల్లించాలంటున్న డిప్యూటీ కలెక్టర్ల సంఘం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తెలంగాణలో 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల అదనపు ఖర్చుల చెల్లింపులపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం మరియు ఎన్నికల సంఘం మధ్య వివాదం నెలకొంది.
సుమారు రూ.90 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం డిమాండ్ చేయగా, బడ్జెట్ కేటాయింపుల పరిధిలో ఉన్న బిల్లులన్నీ చెల్లించామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అదనపు ఖర్చులకు అనుమతి ఇచ్చిన అధికారుల వివరాలతో నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఎన్నికల సంఘం కోరింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Election Expenditure | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ఖర్చుల బకాయిల చెల్లింపు వ్యవహారం రాష్ట్ర సీఈవో కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా అదనంగా ఖర్చు చేసిన సుమారు రూ.90 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
బడ్జెట్ కేటాయింపుల పరిధిలో ఉన్న బిల్లులన్నీ ఇప్పటికే చెల్లించామని, ఎలాంటి బకాయిలు లేవని ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్నికల నిర్వహణ కోసం వివిధ ఖర్చుల కింద కేటాయించిన బడ్జెట్ సరిపోలేదని, అదనపు వ్యయం చేసినట్టు డిప్యూటీ కలెక్టర్ల సంఘం పేరొన్నది. దీంతో పలు నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) ఎన్నికల సంబంధిత ఖర్చుల కోసం వ్యక్తిగతంగా అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిపింది. అదనపు నిధుల విడుదలలో జాప్యం కారణంగా అప్పులు ఇచ్చిన వారి నుంచి అధికారులకు ఒత్తిడి పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)