Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎస్.ఆర్ శంకరన్ జీవితం నేటి యువతకు ఆదర్శం
By Eenadu||1 min read at Eenadu
In brief
Locals and public organizations in Gattu celebrated the birth anniversary of retired IAS officer S.R. Sankaran.
Speakers praised his service to the poor, Dalits, tribals, and weaker sections, stating his life is an ideal for today's youth.
The event was attended by various community representatives and local people.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గట్టు: మండల కేంద్రంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, ప్రజా సేవకుడు ఎస్.ఆర్. శంకరన్ జయంతి వేడుకలను స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. పేదలు, దళిత, గిరిజన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శంకరన్ చేసిన సేవలను కొనియాడారు.ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో శివకుమార్, ఆంజనేయులు, శేఖర్, నందిని, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)