Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Godavarikhani | ఆపరేషన్ అడ్డగుంట.. అభివృద్ధి పేరుతో భవనాల కూల్చివేత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Ramagundam Municipal Corporation began demolishing buildings in Addaguntapalli, Godavarikhani, under 'Operation Addaguntapalli', resuming after a one-month pause following the end of 'Operation Pochamma Maidan'.
Local residents expressed anxiety over the demolitions, alleging they are selectively targeting buildings under the guise of road development, while municipal officials state the action is due to non-compliance with setback notices.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 26 : రామగుండం నగర పాలక సంస్థ ఆపరేషన్ అడ్డగుంటకు నడుం బిగించింది. గత సెప్టెంబర్ 9న ఆపరేషన్ పోచమ్మ మైదాన్ సమాప్తం కావడంతో నెల రోజుల విరామం తర్వాత అడ్డగుంటపల్లిలో జంక్షన్, రోడ్లు అభివృద్ధి పేరుతో కూల్చివేతలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా సోమవారం నగర పాలక సంస్థ 57వ డివిజన్ పరిధిలోని అడ్డగుంటపల్లిలో గల అబ్దుల్ కలాం విగ్రహం జంక్షన్ వద్ద రోడ్డు పక్కన గల భవనాన్ని నగర పాలక పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రెండు ఎక్స్కవేటర్లతో కూల్చివేత చర్యలకు ఉపక్రమించారు. రోడ్డు వెడల్పులో భాగంగా సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన భవన యజమానులకు నోటీసులు జారీ చేసినా స్పందించని కారణంగా…
కాగా, వారం రోజుల క్రితం ఇదే 57వ డివిజన్ పరిధి ఎన్టీఆర్ నగర్ లో రోడ్డుకు 30 ఫీట్లు సెట్ బ్యాక్ ఉండాలని నడుమ నంబర్ లేని జేసీబీలతో ఓ భవనం కూల్చివేత సంఘటన జరిగిన నేపథ్యంలో తాజాగా ఇదే డివిజన్ లో మరో భవనం కూల్చివేత జరిగింది. వరుస సంఘటనల నేపథ్యంలో కూల్చివేతలు ఇక్కడికే పరిమితమా? కొనసాగింపు ఉంటుందా.? అని డివిజన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడ్డగుంటపల్లి జంక్షన్ అభివృద్ధి పేరుతో భవనాలకు నోటీసులు జారీ చేసి అదను చూసి కూల్చివేత చర్యలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన విషయమై నగర పాలక అధికారులను సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)


