Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Godavarikhani | కరాటే లో చిచ్చర పిడుగు.. ఒకే టోర్నమెంట్లో రెండు బంగారు పతకాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఆలిండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో గోదావరిఖనికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు రాకం అయాన్ చంద్రశేఖర్ రెండు బంగారు పతకాలు సాధించాడు.
గతంలో రెండు వేర్వేరు కరాటే టోర్నమెంట్లలో రజత, కాంస్య పతకాలు గెలుచుకున్న అతను, ఈ తాజా పోటీల్లో అసాధారణమైన ప్రతిభను చాటాడు.
పాఠశాల అధికారులు మరియు కరాటే కోచ్ సోమవారం అతన్ని అభినందించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 24 : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్టు గోదావరిఖనికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు కరాటేలో చిచ్చరపిడుగు అయ్యాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఆలిండియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో అసాధారణమైన ప్రతిభను చాటాడు. ఒకే టోర్నమెంట్ లో రెండు బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించాడు. గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం శ్వేత- కిరణ్ దంపతుల రెండో కుమారుడు రాకం అయాన్ చంద్రశేఖర్ నగర్ లో గల గుడ్మార్నింగ్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు కరాటేపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నారు.
గత మార్చి నెలలో జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు కరాటే టోర్నమెంట్లలో తొలిసారిగా బరిలోకి దిగి వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించి విజయం వైపు నడిచాడు. తాజాగా జరిగిన ఆలిండియా కరాటే పోటీల్లో ఆద్వితీయమైన ప్రతిభతో రెండు స్వర్ణ పతకాలు గెలిచాడు. పట్టుదల, నిరంతర సాధన ఉంటే ఎంతటి విజయమైనా సాధించవచ్చని నిరూపించాడు. ఈమేరకు ఆయన్ష్ ను పాఠశాల కరస్పాండెంట్ సమ్మారావు, ప్రిన్సిపాల్ సమ్మిరెడ్డి, డైరెక్టర్ తిరుపతి రెడ్డి, కరాటే కోచ్ పసునూటి చందు సోమవారం అభినందించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)