Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్‌లో జెహ్టూలింగ్ సెంటర్ ప్రారంభం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
జెహ్ ఏరోస్పేస్ హైదరాబాద్‌లోని తమ తయారీ కేంద్రంలో కొత్తగా టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సెల్‌ను ప్రారంభించింది.
ఏరో ఇంజిన్ల తయారీకి అవసరమైన టూలింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది.
తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని తమ తయారీ కేంద్రంలో జెహ్ ఏరోస్పేస్ కొత్తగా టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. ఏరో ఇంజిన్ల తయారీకి అవసరమైన కీలక టూలింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కంపెనీ సహ వ్యవస్థాపకులు విశాల్ సంఘ్వి, వెంకటేశ్ ముద్రగళ్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏరో ఇంజిన్ తయారీకి అవసరమైన టూలింగ్ అసెంబ్లీల డిజైన్, తయారీ, తనిఖీ పనులు ఇక్కడ జరుగుతాయి. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కంపెనీ రెండో తయారీ కేంద్రం మాక్-2లో కొత్త ప్రొడక్టులు ఉత్పత్తి అవుతాయి. టూల్ డిజైన్, ప్రోగ్రామింగ్, ప్రెసిషన్ మ్యాచింగ్, తనిఖీ విభాగాల్లో నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జెహ్ విమానయాన, రక్షణ రంగాలకు విడిభాగాలను తయారు చేస్తోంది.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)