Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former minister and BRS MLA Harish Rao criticized the Congress government for power cuts that destroyed thousands of acres of paddy crops in the Medak district's Narsapur constituency.
He visited the affected fields and promised to fight for complete crop compensation and debt waivers for the farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ విద్యుత్ కోతల కారణంగా వేలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో వరి పంట పొలాలను ఆయన సందర్శించారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఎదుట వాపోయారు. రైతుబంధు పథకం కింద పూర్తిస్థాయిలో సాయం అందలేదని, కేవలం ఒక్క ఎకరానికే డబ్బులు వేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)