Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
During a tour of Narsapur constituency in Medak district, former minister Harish Rao witnessed farmers crying over dried crops due to electricity and irrigation shortages.
Farmers complained that the Revanth Reddy government failed to provide timely power, stopped the Rythu Bandhu scheme, and did not implement loan waivers.
Harish Rao criticized the Congress government for these failures and assured the farmers that the BRS government would return to power to solve their problems.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మెదక్ : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎదుట అన్నదాతలు అడుగడుగునా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కదిలించింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని హరీశ్ రావు ఎదుట రైతులు వాపోయారు. సకాలంలో కరెంటు అందక తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని కుమార్ అనే రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటుతో రెండు పంటలు పండించుకున్నాం.. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు.
వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరికొంత మంది అన్నదాతలు మండిపడ్డారు. రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని హరీశ్ రావుకు మొరపెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా .. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)