Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇందిరమ్మ టవర్స్ నాణ్యతకు ‘రేరా’ భరోసా : మంత్రి పొంగులేటి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడ్చల్ కలెక్టరేట్ పరిధిలోని కౌకూర్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఆయన మాట్లాడుతూ, ఈ టవర్ల నాణ్యత పర్యవేక్షణ బాధ్యతను 'రేరా'కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ.40 వేల కోట్లతో 8 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికే 2.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి గుర్తుచేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలివిడతగా లక్ష ఇళ్ల లక్ష్యంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం మల్కాజిగిరి నియోజకవర్గం కౌకూర్‌లో స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ టవర్స్‌కు మంత్రి భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. టవర్ల నాణ్యత, కాలపరిమితి పర్యవేక్షణ బాధ్యతలను 'రేరా'కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు నెలకోసారి తమ ఫ్లాట్లను పరిశీలించి, నాణ్యత లోపాలుంటే ప్రతి టవర్ వద్ద ఏర్పాటు చేసే బాక్సులో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ.40 వేల కోట్లతో 8 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికే 2.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి గుర్తుచేశారు. ఇది ఓట్ల కోసం చేస్తున్న పని కాదని, పేదల సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు. ఇళ్లు రానివారు నిరాశపడొద్దని, మూడు, నాలుగు విడతల్లో లాటరీ పద్ధతి ద్వారా చివరి లబ్ధిదారుడి వరకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ స్వగృహ, వాంబే కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు డ్రా తీసి కేటాయింపు పత్రాలు అందించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎండీ వి.పి.గౌతమ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)