Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
INDIA bloc in Chennai: స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ.. డీఎంకే నిర్ణయంపై ఉత్కంఠ
By Eenadu2 min read at Eenadu
In brief
ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు చెన్నైలోని డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి చేరుకుని డీలిమిటేషన్ బిల్లుపై చర్చించారు.
డీఎంకే ఎంపీ కనిమొళి తన పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ, నిర్ణయం తుది నిర్ణయం నాయకుడిదే అని పేర్కొన్నారు.
డీఎంకే కార్యకర్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో తదుపరి సమావేశం జరగనుందని మరియు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఈ పరిణామంపై స్పందించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)కు మద్దతు ఇస్తామని డీఎంకే నిన్న చేసిన ప్రకటనతో విపక్ష ఇండియా కూటమి అప్రమత్తమైంది. ఈ మేరకు చెన్నై చేరుకున్న ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నేతలకు డీఎంకే అధినేత స్వాగతం పలికారు. స్టాలిన్‌తో సమావేశమైన ఇండియా కూటమి నేతలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడారు. ‘‘నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి స్పష్టంగా ఉంది. ఇతర పార్టీల వైఖరి ఏంటో వారినే అడగాలి. ఇక డీఎంకే విషయానికి వస్తే.. మా పార్టీ నాయకుడు ఇప్పటికే మా ఎంపీలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ విషయంలో ఆయన తీసుకొనే నిర్ణయమే పార్టీ తుది నిర్ణయం అవుతుంది. ఇండియా కూటమి నేతలు కూడా మా నేతను కలిసేందుకు వచ్చారు. వారితో చర్చలు పూర్తయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలపై మీకు వివరంగా తెలియజేస్తాం’’ అని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)